సినిమా టికెట్ ధరలు పెరగవు, తెలంగాణలో త్వరలోనే తెరుచుకోనున్న థియేటర్లు

10TV Telugu News

cinema theatres: త్వరలోనే తెలంగాణలో సినిమా థియేటర్స్‌ ఓపెన్‌ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ ఇవ్వడంతో.. రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లు ఓపెన్‌ చేసేందుకు యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. అక్టోబర్‌ 15 నుంచి తెర తీసేందుకు సమాయత్తమవుతున్నాయి. సినిమా హాళ్లను పునః ప్రారంభించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. తెలంగాణ సర్కార్‌ ఆదేశాల కోసం థియేటర్స్ యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతి ఇస్తాయని భావిస్తున్నారు సినిమా హాళ్ల నిర్వాహకులు.

కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డ సినిమా థియేటర్స్‌ యాజమాన్యాలు నష్టాలు చవిచూశాయి. ఇక ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి కాస్త తగ్గుతుండగా.. ఇక థియేటర్స్ ప్రారంభించాలని తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని.. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోందని థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆశిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తే.. థియేటర్స్ ప్రారంభిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చాయి యాజమన్యాలు. టిక్కెట్ పంపిణీ విధానం.. సీటుకి సీటుకి మధ్య ఎంత దూరం ఉండాలనే దానిపై చర్చించాయి. శానిటైజేషన్ పద్ధతులు, వాటి వల్ల పెరిగే వ్యయంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ల పునః ప్రారంభంపై ప్రభుత్వంతో చర్చించాల్సిన ఓనర్స్ అసోసియేషన్ చర్చించింది. కాగా, టికెట్ల రేట్లు పెంచబోమని ఓనర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.×