కిక్కే కిక్కు : రూ. 133కోట్ల మద్యం విక్రయాలు

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 03:20 AM IST
కిక్కే కిక్కు : రూ. 133కోట్ల మద్యం విక్రయాలు

హైదరాబాద్ : నూతన సంవత్సరం రోజులో మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31న ప్రజలు మస్త్ ఏంజాయ్ చేశారు. న్యూ ఇయర్ పార్టీల్లో సుమారు రూ. 133కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు…గతేడాది కంటే రూ. 12 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ చివరి వారంలో రూ. 600 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 31న వైన్స్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు..బార్ అండ్ రెస్టారెంట్..క్లబ్బులు…రిసార్ట్స్‌లో మద్యం విక్రయలు అర్ధరాత్రి 1గంట వరకు విక్రయాలు జరగడం…ఆదాయం పెరగడానికి కూడా ఒక కారణం.

సోమవారం ఒక్కరోజే…
రాష్ట్రంలో సాధారణంగా రోజుకు రూ. 50 కోట్ల నుండి రూ. 70 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. డిసెంబర్ 31 సోమవారం ఒక్క రోజే రూ. 133 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. హైదరాబాద్ జిల్లాలో రూ. 19.5 కోట్లు..రంగారెడ్డి జిల్లాలో రూ. 15.36 కోట్లు..ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ. 18 కోట్లు…మేడ్చల్ జిల్లాలో రూ. 11.90 కోట్లు.. మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవతర్సం సందర్భంగా బార్లు..పబ్‌లలో భారీగా మద్యం నిల్వ చేశారు. తాగినంత తాగండి..అంటూ ఆఫర్స్ ప్రకటించడంతో మందుబాబులు నిర్ణీత రుసుము చెల్లించి ఫూటుగా మద్యాన్ని తాగేశారు. ఇక విందు..వినోదాల ఖర్చు కూడా అధికంగా ఉంటుందని అంచనా.

కిక్కిరిసిన బార్లు…
సెలవు రోజు కావడంతో మంగళవారం పబ్‌లు..బార్లు..కిక్కిరిసిపోయాయి. వైన్, రమ్, ఓడ్కా, బీరు అన్న తేడా లేకుండా మహానగర పరిధిలోని 400 మద్యం దుకాణాలు, 500పైగా బార్లలో మద్యం విక్రయాలు భారీగా సాగాయి. మొత్తంగా న్యూ ఇయర్‌లో మద్యం విక్రయాలు కిక్కెంచాయి.