హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

Double-Deckers: మరోసారి హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ కు టెండర్లను ఆహ్వానించింది. మూడు నెలలుగా ఈ సర్వీస్ రీ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని.. అందుకు వీలైన రూట్లలోనే నడుపుతామని చెప్తున్నారు. ఓ కుర్రాడు తన స్కూల్ రోజుల్లో డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగే వాళ్లమని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాలను బట్టి.. సుచిత్ర, పటాన్ చెరు, జీడిమెట్ల, మెహిదీపట్నం ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ సర్వీసులను తిప్పేందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్-మేడ్చల్ వయా సుచిత్ర, సికింద్రాబాద్-పటాన్చెరు వయా బాలనగర్, సీబీఎస్-జీడిమెట్ల, అఫ్జల్ గంజ్-మెహిదీపట్నం, కోటి-పటాన్చెరు లాంటి రూట్లలో ఇవి కనిపించనున్నాయి.

ఈ మేరకు మ్యాన్యుఫ్యాక్చర్లకు టెండర్లు వేసుకోవాలని టీఎస్ఆర్టీసి చెప్పింది. ముందుగా నాన్ ఏసీ సర్వీసుతో కూడిన 25బస్సులను నడుపుతారు. బీఎస్-6స్టాండర్డ్స్ తో డీజిల్ తో ఇవి నడుస్తాయి. ఫిబ్రవరి 4నుంచి ఫిబ్రవరి 25వరకూ టెండర్లు వేసేందుకు అవకాశమిచ్చారు.

టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ రఘనాథ్ రావు మాట్లాడుతూ… హైదరాబాద్ డబుల్ డెక్కర్ సర్వీసులు తిరిగేందుకు చాలా రూట్స్ అనుకూలంగా ఉన్నాయన్నారు. రెప్యూటెడ్ మ్యాన్యుఫ్యాక్చర్లను టెండర్లకు ఆహ్వానించాం. ఈ సంవత్సరాంతం నాటికి డబుల్ డెక్కర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయనుకుంటున్నాం.

ఈ బస్సులు 4.7మీటర్ల ఎత్తుతో పాటు 8.7మీటర్ల వెడల్పు ఉండనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లోనే ఇవి తిరుగుతాయి. రెగ్యూలర్ బస్సులో ఉండే 36 సీట్ల స్థానంలో 60సీట్లు భర్తీ చేస్తాయి. దాంతో పాటు నిల్చొని ప్రయాణించడానికి ఇంకా ఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది. 1990లలో హైదరాబాద్ మొత్తం ఈ బస్సులు పాపులర్ గా ఉండేవి.

అప్పట్లో సికింద్రాబాద్-మెహిదీపట్నం, నాంపల్లి-ఛార్మినార్, మెహిదీపట్నం-దిల్ సుఖ్ నగర్ రూట్లల్లో కూడా తిరిగేవి. అయితే 2000సమయంలోనూ ఈ సర్వీసును మరోసారి పరిచయం చేశారు. నెక్లెస్ రోడ్ మీదుగా హుస్సేన్ సాగర్ చుట్టూ తిరగడానికి టూరిస్టులను ఆకర్షించడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయింది.