ఇంటర్ ఫలితాల్లో మా తప్పులేదు : గ్లోబరీనా సీఈవో రాజు

  • Published By: chvmurthy ,Published On : April 23, 2019 / 10:20 AM IST
ఇంటర్ ఫలితాల్లో మా తప్పులేదు : గ్లోబరీనా సీఈవో రాజు

హైదరాబాద్: ఇంటర్మీడియేట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు గ్లోబరీనా సీఈవో రాజు. ఇంటర్‌ ఫలితాల్లో గ్లోబరీనా సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత నిజాలు బయటకు వస్తాయని రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ మార్కులవిషయంలో గ్లోబరీనా సంస్థ వల్లే తప్పు జరిగిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కమిటీ ఇచ్చే రిపోర్టుకు మేము కట్టుబడి ఉంటాం అని ఆయన స్పృష్టం చేశారు.  తమ సంస్ధకు టెక్నికల్‌గా పూర్తిస్థాయి అర్హతలున్నాయని, లాబీయింగ్‌ చేసి ఈ కాంట్రాక్ట్‌ తెచ్చుకోలేదని ఆయన వివరించారు. గతంలో 26 పెద్ద యూనివర్సిటీలతోనూ 1000  కాలేజీలతో కలిసి పనిచేశామని, ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీలతో ఇంకా కలిసి పని చేస్తున్నామని ఆయన చెప్పారు.

మార్కులు, ఫలితాల విషయంలో విద్యార్దులకు ఏదైనా సందేహలుంటే  రీవెరిఫికేషన్, రీ చెకింగ్ చేసుకోవచ్చని, విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. తమ సంస్ధపై గత 2 రోజులుగా బాగా దుష్ప్రచారం  జరిగింది అని అన్నారు. 2001 లో  సంస్దను స్ధాపించామని జెఎన్టీయూ కాకినాడ తో 2012 లో కాంటాక్ట్ పెట్టుకున్నాము. 2 సంవత్సరాలు వాళ్లకు మేము సేవలు అందించామని, మా సేవలకు వారు సంతృప్తి చెందారని ఆయన అన్నారు.