హైదరాబాద్‌లో ఐఫోన్ రీసెర్చ్ సెంటర్

హైదరాబాద్ : ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి కంపెనీలను అట్రాక్ట్ చేస్తోంది. నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి కేంద్రం రానుంది. ప్రపంచ

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 09:48 AM IST
హైదరాబాద్‌లో ఐఫోన్ రీసెర్చ్ సెంటర్

హైదరాబాద్ : ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి కంపెనీలను అట్రాక్ట్ చేస్తోంది. నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి కేంద్రం రానుంది. ప్రపంచ

హైదరాబాద్ : ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి కంపెనీలను అట్రాక్ట్ చేస్తోంది. నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి కేంద్రం రానుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ల తయారీ సంస్థ, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూపు నగరంలో అడ్వాన్స్ ఇండస్ట్రీయల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఫాక్స్‌కాన్ డైరెక్టర్ మైకేల్ యాంగ్, తెలంగాణ ఐటీ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ విభాగ డైరెక్టర్ సుజయ్ కారంపురిలు ఎంవోయూ మీద సంతకాలు చేశారు.

 

ఫాక్స్‌కాన్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇది టెక్నాలజీ సేవలు, స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సొల్యూషన్లను అందిస్తుంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని భారత్‌లో విద్యా సంస్థలు, పరిశ్రమలతో కలిసి ఈ  కేంద్రం ఆధారంగా మొబైల్‌ డివైసెస్‌, ఐఓటీ, బిడ్‌ డేటా వంటి విభాగాల్లో పరిశోధనలు నిర్వహిస్తారు.

 

ఇండస్ట్రీయల్ ఏఐ (కృత్రిమ మేధస్సు), ఇండస్ట్రీయల్ ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)లకు హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.  హైదరాబాద్‌లో విద్యాధికులకు, టెక్నాలజీ నిపుణులకు కొదవలేదని అన్నారు. అందుకే, హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి మంచి ఆదరణ ఉంటుందని చెప్పారు.

 

నిపుణులైన యువత సంఖ్యకు కొదవే లేదని, దీనికి పరిశ్రమ సాయం లభిస్తే మరింత మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నదని రంజన్ అన్నారు. అధ్యయన, అభివృద్ధి కేంద్రం ద్వారా ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సేవల్ని అందిస్తుందన్నారు. ఈ సంస్థ భారత్‌లో చేపట్టే కార్యకలాపాల్ని హైదరాబాద్ నుంచి నిర్వహిస్తుందని తెలిపారు. నెట్‌వర్క్ స్విచెస్, రూటర్స్, వైర్‌లెస్ డివైజ్‌లు, వెబ్ సర్వర్లు, సెట్ టాప్ బాక్సులు, స్మార్ట్ హోమ్ గేట్‌వేస్ , స్టోరేజ్ ఎక్విప్ మెంట్ తదితర ప్రొడక్ట్స్‌ను ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తయారు చేసి విక్రయిస్తుంది.