హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : 50 వేల పోలీసుల నిఘా 

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 07:22 AM IST
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం : 50 వేల పోలీసుల నిఘా 

హైదరాబాద్ వినాయకుడి నిమజ్జన వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణను సిద్దింబర్ బజార్‌లోని బహేతి భవన్‌లో  కమిషనర్ అంజని కుమార్
నగర పోలీసులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితితో సోమవారం (సెప్టెంబర్ 9)న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ నిమజ్జనంపై రౌండ్-ది-క్లాక్ నిఘా (24 గంటలూ)ఉంచాలని కమిషనర్ అంజని కుమార్ డీఎస్పీలందరికీ ఆదేశాలు జారీ చేసింది. నిబంధలన ప్రకారంగా నిమజ్జన కార్యక్రమం జరగాలనీ దానికి తగిన జాగ్రత్తలు సమన్వయంతో జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రతినిధులకు సూచించారు. 

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజని కుమార్, మహేష్ బాగవత్ రాచకొండంద్ పోలీసు కమిషనర్, సజ్జనార్ సైబరాబాద్ పోలీసు కమిషనర్, అనిల్ కుమార్ హైదరాబాద్ అదనపు కమిషనర్ ట్రాఫిక్ మరియు ఆర్టీఏ జాయింట్ కమిషనర్, రాఘవ్ రెడ్డి బిజియుఎస్ అధ్యక్షుడు, డాక్టర్ బాగ్వంత్ రావు ప్రధాన కార్యదర్శి బిజియుఎస్, రామరాజు. ఈ సమావేశంలో బిజియుఎస్, శశిధర్ కార్యదర్శి బిజియుఎస్ హాజరై అన్ని ఏర్పాట్ల గురించి చర్చించారు.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ..నిమజ్జన వేడుకలకు 50 వేల మంది పోలీసులతో పూర్తిస్థాయి బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు జరిగాయిన తెలిపారు. ఎటువంటి పుకార్ల అవకాశం లేకుండా చూడాలని సమితి సభ్యులకు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసుకునేందుకు 24 గంటలు  పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

ఆర్టీఏ జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ..లారీలు, డీసీఎం వంటి పలు వాహనాలు నగరంలో 12 ట్రాన్స్ పోర్ట్ సెంటర్లను ఏర్పాటు చేసామన్నారు. పటాంచెరు, మేడ్చల్, ఎల్.బి.నగర్ లతో పాటు పలు ప్రాంతాలలో ట్రాన్స్ పోర్ట్ సెంటర్లలో 10 మంది ఆర్టీఏ అధికారులు, 10 డిప్యూటీ కమిషనర్, 2 జాయింట్ కమిషనర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.  

నిమజ్జనం ఊరేగింపును విజయవంతంగా జరగటానికి పోలీసులను,గణేష్ భక్తులు సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్లు చేశామని  రాచకొండం కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.  నిమజ్జన ఊరేగింపును సురక్షితంగా..ప్రశాంతంగా నిర్వహించటానికి సంబంధిత అన్ని శాఖలతో సమన్వయంచేసుకున్ని అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. సీసీ కెమెరాలు.అవుట్ పోస్ట్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, వాలంటీర్లలు వంటి అన్ని అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.