ఫలించిన పోలీసుల వ్యూహం : ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

హైదరాబాద్‌లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 02:32 AM IST
ఫలించిన పోలీసుల వ్యూహం : ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

హైదరాబాద్‌లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల

హైదరాబాద్‌లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల జయజయధ్వానాల మధ్య వచ్చే ఏడాది మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. వినాయక చవితి నాటి పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. హైదరాబాద్‌లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. నగరంలో ఎక్కడచూసినా ఆధ్యాత్మికశోభ ఉట్టిపడింది. డప్పుల దరువులు, తీన్మార్‌ డ్యాన్సులతో గణేశుడికి వీడ్కోలు పలికారు. 

ప్రధాన నిమజ్జన కేంద్రం హుస్సేన్‌సాగర్‌తోపాటు గ్రేటర్‌లోని 32 ప్రాంతాల్లో నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ఖైరతాబాద్ ద్వాదశాదిత్య మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర.. మధ్యాహ్నం ఒంటిగంటకు హుస్సేన్‌సాగర్ తీరానికి చేరింది. అర్చకులు గంగమ్మ తల్లికి పూజలు చేశాక.. మధ్యాహ్నం 1:30 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 6 వద్ద మహా వినాయకుడిని నిమజ్జనం చేశారు. 

నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులతో సాగరతీరం జనసంద్రంగా మారింది. ఉదయం మొదలైన భక్తుల రాక అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ప్రత్యేక అలంకరణ, వివిధ రకాల ఆకారాల్లో కొలువుదీరిన గణపతులను చూసేందుకు భక్తులు ఆసక్తి ప్రదర్శించారు. బోలో గణేశ్ మహరాజ్‌కీ జై, గణపతి బప్పా మోరియా… నినాదాలతో నిమజ్జన ప్రాంతాలు హోరెత్తాయి. పలువురు విదేశీయులు కూడా నిమజ్జనాన్ని తిలకించారు.

పోలీస్‌శాఖ చేపట్టిన పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు వ్యూహాలతో నిమజ్జనం విజయవంతంగా ముగిసింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ ఎప్పటికప్పుడు శోభాయాత్రను పర్యవేక్షించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్‌లో హుస్సేన్‌సాగర్‌ దగ్గర నిమజ్జన పర్వాన్ని వీక్షించారు. మొత్తంగా నిమజ్జనం ప్రశాంతంగా ముగియడం పట్ల అటు పోలీసులు, ఇటు పాలకులు హర్షం వ్యక్తంచేశారు.