Hyderabad : గ్యాస్ సిలిండర్ కు కట్టేసి స్వర్ణకారులను చితకబాదిన గోల్డ్ వ్యాపారి

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిధిలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ గోల్డ్ వ్యాపారి. బంగారు నగలు తయారుచేసే స్వర్ణకారులను ఓ గోల్డ్ వ్యాపారి చితకబాదాడు. నగలు తయారుచేయటంతో నిర్లక్ష్యం వహించారంటూ రూమ్ లో గ్యాస్ సిలిండకర్ కు కట్టేసి మనుష్యలతో దారుణంగా కొట్టించాడు.

Hyderabad : గ్యాస్ సిలిండర్ కు కట్టేసి స్వర్ణకారులను చితకబాదిన గోల్డ్ వ్యాపారి

Hyderabad Old Cit

Updated On : July 26, 2021 / 11:15 AM IST

Hyderabad Old city : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ పరిధిలో అత్యంత దారుణానికి పాల్పడ్డాడు ఓ గోల్డ్ వ్యాపారి. బంగారు నగలు తయారుచేసే స్వర్ణకారులను ఓ గోల్డ్ వ్యాపారి చితకబాదాడు. నగలు తయారుచేయటంతో నిర్లక్ష్యం వహించారంటూ రూమ్ లో బంధించి మనుష్యలతో దారుణంగా కొట్టించాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పాతబస్తీ పరిధిలోని తపేళాగంజి ప్రాంతానికి పశ్చిమబెంగాల్ నుంచి కొంతమంది స్వర్ణకారులు నగరానికి వచ్చి ఉపాధి పొందతున్నారు. గోల్డ్ వ్యాపారునుంచి బంగారాన్ని తెచ్చుకుని నగలు చేయించి ఇస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది బెంగాల్ స్వర్ణకారులు ఓ గోల్డ్ వ్యాపారి నుంచి బంగారం తీసుకుని నగలు తయారు చేశారు. కానీ నగల తయారీ విషయంలో సదరు స్వర్ణకారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని సదరు గోల్డ్ వ్యాపారి స్వర్ణకారులను తీవ్రంగా చితకబాదాడు.

కొందరు మనుషులతో సహా స్వర్ణకారులు నివసించే రూమ్ కు వచ్చారు. వారు ఎటూ కదలకుండా వారిపై ఎదురు తిరగకండా వంట గ్యాస్ సిలిండర్ కు తాళ్లతో కట్టేసి అత్యంత దారుణంగా చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్వర్ణకారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.