ఏదైనా ఆరేళ్ల త‌ర్వాతే… జిమ్నాస్టిక్స్ అరుణ

జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో వ్య‌క్తిగ‌త మెడల్ సాధించిన తొలి భార‌తీయ జిమ్నాస్ట్ అరుణ బుద్దా రెడ్డి మీకు తెలుసు క‌దా. 2017 ఆసియా చాంపియన్షిప్లో, అరుణ...ఉమ‌న్ వాల్ట్ లో 6 వ స్థానంలో నిలిచింది. నా ల‌క్ష్యం వేరే ఉంది దాన్ని రీచ్ అవ‌డ‌మే నా ప్ర‌స్తుత ఆలోచ‌న అంటూ శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్న విష‌యాలివి...

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 05:07 AM IST
ఏదైనా ఆరేళ్ల త‌ర్వాతే… జిమ్నాస్టిక్స్ అరుణ

జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో వ్య‌క్తిగ‌త మెడల్ సాధించిన తొలి భార‌తీయ జిమ్నాస్ట్ అరుణ బుద్దా రెడ్డి మీకు తెలుసు క‌దా. 2017 ఆసియా చాంపియన్షిప్లో, అరుణ…ఉమ‌న్ వాల్ట్ లో 6 వ స్థానంలో నిలిచింది. నా ల‌క్ష్యం వేరే ఉంది దాన్ని రీచ్ అవ‌డ‌మే నా ప్ర‌స్తుత ఆలోచ‌న అంటూ శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్న విష‌యాలివి…

‘నా దృష్టంతా నా లక్ష్యం పైనె అంటున్న జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి. నా ల‌క్ష్యం 2020 ఒలంపిక్స్ ప్ర‌స్తుతం నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. మరో ఆరేళ్ల వ‌ర‌కు పెళ్లి గురించి ఆలోచ‌నైతె లెదు. ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటలు, షాపింగ్‌ చేస్తుంటాను. కారులో తిరుగుతూ సిటీలో రౌండ్స్‌ వేయడమంటే మరీఇష్టమని చెప్పింది అరుణారెడ్డి. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు…
హిమాయత్‌నగర్‌ : పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒలింపిక్స్‌ మీదనే. నా వయసు కూడా చాలా చిన్నదే కాబట్టి ఇప్పుడే పెళ్లేంటని ఆలోచిస్తున్నాను. అందుకే ఆరేళ్ల వరకు నో మ్యారేజ్‌. ఇంకో విష‌యం ఎంటంటే అది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది కూడా అప్పుడే చెబుతానంటోంది. అప్పటి వరకు సీక్రెట్‌’ అంటూ చెప్పుకొచ్చింది అరుణారెడ్డి. ఈ మ‌ద్య కాలికి గాయం కావ‌డంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. 
నాకు టైమ్‌ దొరికితే ఫ్యామిలీతోనే ఉంటాను. మా అక్క, బావ, వారి పిల్లలు పూర్వీ, నిషాంత్‌లతో ఆడుకుంటూ ఎంజాయ్‌ చేస్తాను. వాళ్లే నా ప్రపంచం. ప్రతిరోజు అమ్మ సుభద్ర, అక్క పావని నాకోసం వెరైటీ వంటలు చేస్తుంటారు. వారికి రెస్ట్‌ ఇచ్చేందుకు అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తుండేదాన్ని. అలా అలా వంటలు నేర్చుకున్నాను. వీకెండ్స్‌లో చికెన్, మటన్, ఫిష్‌ కర్రీ వండి ఇంట్లో వాళ్లపైనే ట్రై చేస్తుంటాను.