Telangana Secreteriat: 30న ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్క్ మూసివేత.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Secreteriat: ఆ రోజున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు.

Telangana Secreteriat: 30న ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్క్ మూసివేత.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions

Telangana Secreteriat: తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనుకోగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 30న సచివాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అలాగే, 30న ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్క్ మూసివేస్తారు. ఆ రోజున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. చింతల్ బస్తీ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపునకు రానివ్వబోరు.

సోమాజిగూడ, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపునకు మళ్లిస్తారు. అలాగే, ఇక్బాల్ మినార్ నుంచి వెళ్లే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల అనంతరం తెలంగాణ కొత్త సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహిస్తారు. తాజాగా, తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పరిశీలించారు. సచివాలయంలో ఎలివేషన్‌, గ్రీన్‌ లాన్‌, టూంబ్‌ నిర్మాణం వంటి పనులు కూడా పూర్తవుతున్నాయి.

Apple Days Sale : ఏప్రిల్ 29 నుంచి ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 13పై భారీ డీల్స్.. మరెన్నో ఆఫర్లు..!