ఇంటర్ ఆరని మంటలు : బీజేపీ తెలంగాణ బంద్

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది.  రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, యువజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

  • Published By: madhu ,Published On : May 2, 2019 / 02:08 AM IST
ఇంటర్ ఆరని మంటలు : బీజేపీ తెలంగాణ బంద్

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది.  రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, యువజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది.  రాజకీయ పార్టీలతోపాటు విద్యార్థి, యువజన సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. మే 02వ తేదీ గురువారం రాజకీయ పార్టీలతోపాటు విద్యార్ధి సంఘాలు పలు నిరసనలు చేపట్టనున్నాయి. బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. అఖిలపక్ష నేతలు సూసైడ్‌ చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించనున్నారు. విద్యార్థులకు న్యాయం చేయడంతోపాటు బాధ్యులైన వారిని శిక్షించాలన్న డిమాండ్‌తో బంద్‌ తలపెట్టింది. ప్రభుత్వ తీరును బీజేపీ నేతలు ఎండగడుతున్నారు. 

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు అఖిలపక్ష నేతలు నివాళులు అర్పించనున్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష నేతలు ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. 20 మంది ఇంటర్‌ విద్యార్థులకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరుతున్నారు.  విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాయి. గ్లోబరీనా సంస్థ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఫలితాలు తప్పుల తడకలా ఉండటానికి గ్లోబరీనా సంస్థే కారణమని…ఆ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. గ్లోబరీనాపై చర్యలు తీసుకోవాలంటూ ముట్టడికి పిలుపునిచ్చారు. యూత్‌ కాంగ్రెస్‌ కూడా నిరసన దీక్షలు చేపట్టనుంది. ఇంటర్‌ వివాదంలో సర్కార్‌ తీరును నిరసిస్తూ  ఈ దీక్షలు కొనసాగనున్నాయి.
Also Read : ఒక్క నిమిషం నిబంధన అమలు : మే 03న తెలంగాణలో ఎంసెట్