IPL 2019 : ట్రాఫిక్ మళ్లింపు..పార్కింగ్ ప్లేస్‌లు

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 06:21 AM IST
IPL 2019 : ట్రాఫిక్ మళ్లింపు..పార్కింగ్ ప్లేస్‌లు

IPL 2019 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో మే 12వ తేదీ ఆదివారం మ్యాచ్ జరుగబోతోంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారి పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు, ఇతరత్ర వాటిని వివరించారు. మొత్తం నాలుగు పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. 

* హబ్సిగూడ నుండి వచ్చే ఫోర్ వీలర్స్ ఏక్ మినార్ నుండి రైట్ సైడ్‌కు వెళ్లి జెన్ పార్క్ వద్ద పార్కింగ్ చేయాలి. 

హబ్సిగూడ నుండి వచ్చే టూ వీలర్స్ NGRI నుండి ఉప్పల్ వైపు ఉన్న మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేయాలి.

రామాంతాపూర్ నుండి వచ్చే ఫోర్ వీలర్స్ చర్చీ గేట్ వద్ద పార్కింగ్ చేయాలి. 

ఎల్ బి నగర్ నుండి వచ్చే ఫోర్ వీలర్స్ డీఎస్ఎల్ వద్ద పార్కింగ్ చేయాలి. 

ఉప్పల్, రామంతాపూర్ నుండి వచ్చే ద్విచక్ర వాహనాలను ఉప్పల్ వైపు ఏర్పాటు చేసిన ప్లేస్‌లో పార్కింగ్ చేయాలి. 

హెవివెహికల్స్‌ దారి మళ్లింపు : – 

చెంగిచెర్ల క్రాస్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ ఉప్పల్ రాకుండా మళ్లింపు. 

NFC గుండా తార్నాకా వైపుకు మళ్లింపు. 

ఎల్ బి నగర్ నుండి వచ్చే వాహనాలు నాగోల్ వద్ద యూ టర్న్ చేసుకుని వెనక్కి మళ్లింపు.