Agnipath: సికింద్రాబాద్‌లో హింస‌పై రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు: కిష‌న్ రెడ్డి

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అగ్నిపథ్ విషయంలో యువతను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయ‌న అన్నారు.

Agnipath: సికింద్రాబాద్‌లో హింస‌పై రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు: కిష‌న్ రెడ్డి

Kishna Reddy

Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆర్మీ ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడిన తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. అగ్నిపథ్ విషయంలో యువతను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయ‌న అన్నారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారని ఆయ‌న చెప్పారు. అగ్నిపథ్ విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. యువతలో దేశ భక్తి, జాతీయ వాదాన్ని పెంచేందుకు అగ్నిపథ్ తీసుకువచ్చారని ఆయ‌న అన్నారు. చిన్ననాటి నుంచే చాలా మంది ఆర్మీలోకి వెళ్లాలని కలలు కంటారని ఆయ‌న చెప్పారు. అగ్నిపథ్ పథకంలో స్వచ్ఛందంగా ఇష్టపడ్డ వారే చేరవచ్చని అన్నారు. ఇజ్రాయిల్‌లో తప్పనిసరిగా యువతి, యువకులు ఆర్మీలో పనిచేయాలనే నిబంధన ఉందని ఆయ‌న చెప్పారు.

Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..

అనేక దేశాల్లో అగ్నిపథ్ లాంటి పథ‌కాలు ఉన్నాయని తెలిపారు. బ్రెజిల్‌లో 18 సంవత్సరాలు దాటిన వారు 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలు, ఉత్తర కొరియాలో 17 ఏళ్ళు నిండిన వారు ఆర్మీలో పనిచేయాలని ఆయ‌న చెప్పారు. సౌత్ కొరియా, మెక్సికో, యూఏఈ, సింగపూర్, స్విడ్జర్లాండ్, టర్కీ, గ్రీస్‌లో తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపారు. కానీ, భారత్‌లో మాత్రం ఇష్టం ఉన్న వారే సైన్యంలో చేరేలా అగ్నిప‌థ్ ప‌థ‌కం ఉందని చెప్పారు. అగ్నిపథ్ కింద సైన్యంలో పనిచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో చేరవచ్చని అన్నారు. అగ్నిపథ్ వీరులకు నాలుగేళ్ళ పాటు వృత్తి నైపుణ్యం అందిస్తార‌ని చెప్పారు. అగ్నిపథ్ పథకంపై కొంద‌రు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. మోదీ ప్రధాని కాక ముందు నుంచి సైనిక సంస్కరణలపై చర్చ జరుగుతుందని అన్నారు.

Agnipath: హైద‌రాబాద్ మెట్రో రైళ్ళు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు

అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథ‌కం తీసుకువచ్చామ‌ని తెలిపారు. దేశ సేవ కోసం.. దేశానికి యుద్ధ‌ సమయంలో ఉపయోగపడేలా స్వచ్ఛంద పథ‌కాన్ని కేంద్రం తీసుకువచ్చిందని ఆయ‌న అన్నారు. అగ్నిపథ్‌పై కుట్ర చేయడం దురదృష్టకరమ‌ని చెప్పారు. రైల్వే స్టేష‌న్‌లో ఆందోళ‌న‌తో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టారని, పోలీసులు పట్టించుకోలేదని ఆయ‌న అన్నారు. 40 మోటార్ సైకిళ్ళు కాల్చేశారని, షాపులు ధ్వంసం చేశారని ఆయ‌న చెప్పారు. సికింద్రాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వనిదే బాధ్యత అని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆయ‌న అన్నారు రైల్వే స్టేషన్లలో గొడవ జరుగుతుందని తెలిసిన తరువాత సకాలంలో పోలీసులు రావాలని, ఎందుకు అల్లర్లు జరిగాయో దర్యాప్తు జరపాలని అన్నారు.

Agnipath: రైళ్ళ‌ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుంది: సీపీఆర్వో రాకేశ్

ఇతర ప్రాంతాల్లో ధర్నాలు జరిగితే ముందే అరెస్ట్ చేస్తారని, ఇప్పుడు ఇంత గొడవ ఎలా జరిగిందని ఆయ‌న ప్ర‌శ్నించారు. రైళ్ళు తగలబెడితే సమస్య పరిష్కరం అవుతుందా అని నిల‌దీశారు. బిపిన్ రావత్ ఉన్నపుడే అగ్నిప‌థ్ ప‌థ‌కంపై చర్చ జరిగిందని, కేంద్ర స‌ర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అనేక కమిటీలు, విదేశీ పర్యటనలు చేసి అగ్నిపథ్ పథ‌కం ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. యువతకు అన్యాయం చేయాలని కేంద్రానికి లేదని చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచాలని, దేశ భక్తి పెంచాలన్న ఉద్దేశంతోనే అగ్నిప‌థ్ ప‌థ‌కం తెచ్చామ‌ని అన్నారు. పెన్షన్ మిగుల్చుకోవడానికి అగ్నిపథ్ పథకం తెచ్చామనడం అపోహ మాత్రమేన‌ని తెలిపారు. ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని అన్నారు.

Agnipath: నేడు దేశంలో ‘అగ్నిపథ్‌’ అగ్ని గుండంలా మారింది: వీహెచ్‌

మంత్రులు ట్విట్టర్ వేదికగా ఆందోళనలకు ఆజ్యం పోసేలా స్పందిస్తున్నారని ఆయ‌న చెప్పారు. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉందని ఆయ‌న తెలిపారు. సికింద్రాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని ఆయ‌న అన్నారు. అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ గురించి తెలుసుకోవాలని ఆయ‌న అన్నారు. కేటీఆర్ రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతారా అని నిల‌దీశారు. కేంద్ర పథ‌కం గురించి చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని ఆయ‌న చెప్పారు. కేంద్ర పథ‌కం కాబట్టి కేంద్ర ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అగ్నిపథ్ పథకం గురించి అనుమానాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధ‌తిలో చర్చించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయ‌న చెప్పారు. హింస ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదని ఆయ‌న చెప్పారు. ఆందోళనకారులు సంయమనం పాటించాలని ఆయ‌న కోరారు. దేశంలో ఎక్కడా గొడవలు జరగకూడదనే కోరుతున్నాన‌ని తెలిపారు.