Agnipath: హైద‌రాబాద్ మెట్రో రైళ్ళు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు

త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన‌ అగ్నిప‌థ్ పథ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో నేడు చెల‌రేగిన‌ ఆందోళ‌న‌ల ప్ర‌భావం హైద‌రాబాద్‌ మైట్రో రైళ్ళ‌పై కూడా పడింది.

Agnipath: హైద‌రాబాద్ మెట్రో రైళ్ళు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు

Hyderabad Metro record

Agnipath: త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన‌ అగ్నిప‌థ్ పథ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో నేడు చెల‌రేగిన‌ ఆందోళ‌న‌ల ప్ర‌భావం హైద‌రాబాద్‌ మైట్రో రైళ్ళ‌పై కూడా పడింది. హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితుల దృష్ట్యా మెట్రో రైలు సేవలను నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మూడు మార్గాల్లోని అన్ని రైళ్ళ‌ను నిలిపివేస్తున్న‌ట్లు చెప్పారు.

Agnipath: రైళ్ళ‌ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుంది: సీపీఆర్వో రాకేశ్

ప్రయాణికులు ఈ అంశాన్ని గుర్తించి ఇతర ర‌వాణా సేవ‌ల‌ను వినియోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. కాగా, ఇప్ప‌టికే ఎంఎంటీఎస్ రైళ్ళ‌న్నీ ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ ప్ర‌యాణికులు అంద‌రూ ఒక్క‌సారిగా బ‌స్సు సేవ‌ల వైపు మ‌ళ్ళే అవ‌కాశం ఉంది. బస్టాపుల్లో రద్దీ పెరగొచ్చు. మరోవైపు, సికింద్రాబాద్‌తో పాటు నాంప‌ల్లి రైల్వేస్టేష‌న్‌లో రైళ్ళు ఉన్న‌ట్టుండి ర‌ద్దు కావ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.