నల్లా లెక్కలు తేలుస్తారు : జలమండలి ఇంటింటి సర్వే

  • Published By: madhu ,Published On : October 12, 2019 / 03:54 AM IST
నల్లా లెక్కలు తేలుస్తారు : జలమండలి ఇంటింటి సర్వే

వాటర్ బోర్డుకు ఆర్థిక నష్టాలు వెంటాడుతున్నాయి. గట్టెక్కించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించారు. నల్లా కనెక్షన్లను లెక్క తేల్చేందుకు రెడీ అయిపోయారు. డొమెస్టిక్, కమర్షియల్ నల్లాలు ఎన్ని ఉన్నాయో పరిశీలించనున్నారు. ఈ తనిఖీల్లో అక్రమ నల్లాలు, నల్లా బిల్లులు చెల్లించని వారి పనిపట్టనున్నారు. ప్రతి నెలా రూ. వేలల్లో బిల్లులు ఏగవేస్తున్న భవనాల గుర్తింపే లక్ష్యంగా అక్టోబర్ 12వ తేదీ శనివారం నుంచి సర్వే సాగనుందని అధికారులు వెల్లడించారు. 
150 మంది సిబ్బందితో 50 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు.

నగర పరిధిలో మొత్తం 10.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా..కమర్షియల్ 30 వేలకు మించి లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. అందులో భాగంగా సర్వే చేపట్టినట్లు వెల్లడింాచరు. నల్లా కనెక్షన్ నంబర్, నీటి మీటర్ సమాచారం, ఇంటి వైశాల్యం, ఎన్ని గదులు, ఎన్ని అంతస్తులు, కనెక్షన్ కేటగిరి తదితర వివరాలను సిబ్బంది సేకరిస్తారు. నిర్దేశిత కేటగిరిలో కనెక్షన్ ఉందా, లేదా ? అనేది పరిశీలిస్తారు. ఒకవేళ డొమెస్టిక్ కనెక్షన్ ఉండి, ఆ భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే..దాన్ని కమర్షియల్ కేటగిరిలోకి మారుస్తారు. నారాయణగూడ, ఎస్ఆర్ నగర్, మారేడుపల్లి, కూకట్ పల్లి, అంబర్ పేట, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్ డివిజన్ల పరిధిలో చేపడుతారు. 
Read More : కుండపోత : హైదరాబాద్‌లో 106 మి.మీ వర్షం