కుక్క మరణం: కేసు పెట్టిన పాటల రచయిత్రి

  • Published By: vamsi ,Published On : April 21, 2019 / 08:07 AM IST
కుక్క మరణం: కేసు పెట్టిన పాటల రచయిత్రి

ప్రాణప్రదంగా పెంచుకునే కుక్కను నిర్లక్షంతో ఆస్పత్రి సిబ్బంది చంపేశారని ఆరోపిస్తూ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు ఓ సినీ గేయరచయిత్రి. మణికొండ సెక్రటేరియెట్‌ కాలనీకి చెందిన రచయిత గౌరీవందన కొన్నిరోజులుగా ఒక వీధి కుక్కను పెంచుకుంటుంది. షైనీ అనే పేరు పెట్టుకుని కక్కను పెంచుకునేవారు. అయితే కుక్క చొంగ కారుస్తుండటంతో వెబ్‌సైట్‌లో 24/7 వైద్యసేవలు అందుబాటులో ఉంటాయనే ప్రకటన చూసి ఆమె కుక్కను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 12, ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్‌ డాగ్‌ క్లినిక్‌కు తీసుకుని వెళ్లారు.

మూడు ఇంజక్షన్లు చేసిన డాక్టర్ వెంటనే డిశ్చార్జ్ చేశారు. అయితే మరుసటి రోజుకు కూడా కుక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె మరోసారి ఆస్పత్రికి కుక్కను తీసుకుని వెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. సిబ్బంది కూడా అందుబాటులో లేరు. వారినుంచి స్పందన కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లగా కుక్క చనిపోయింది. దీంతో ఆసుపత్రి నిర్వాహకులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మెరుగైన వైద్యం అందించి ఉంటే తన కుక్క బతికి ఉండేదని, ఈ విషయాన్ని వదిలి పెట్టనని ఎనిమల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, స్టేట్‌ ఎనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు, వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణలో కూడా ఫిర్యాదు చేస్తానని ఆమె చెబుతున్నారు. కాగా ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.