Massive Theft: హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.40 లక్షల విలువగల వజ్రాలు అపహరణ

ఇక ఇదిలా ఉంటే నగర శివార్లలో దొంగల బెడద ఎక్కువైంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది.

Massive Theft: హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.40 లక్షల విలువగల వజ్రాలు అపహరణ

Massive Theft

Massive Theft: హైదరాబాద్ నగర శివార్లలో భారీ చోరీ జరిగింది. హయత్ నగర్ పరిధిలో నివాసం ఉంటున్న వ్యాపారి, జ్యోతిష్యుడు మురళి ఇంట్లో 40 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను ఎత్తుకెళ్లారు దొంగలు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10 తేదీన మురళి రూ.1 కోటి 50 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను ఆయన ఇంట్లో పెట్టాడు.

ఆ తర్వాత వీటిలో కొన్నింటిని తాను నిర్వహిస్తున్న షాపుకు తీసుకెళ్లాడు. రూ.40 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను ఇంట్లోనే ఉంచారు. ఈ నెల 15 న మురళి ఇంట్లో లేని సమయంలో దొంగలు పడి ఇంట్లో పెట్టిన వజ్రాలు, జాతిరత్నాలు ఎత్తుకెళ్లారు. మురళి షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడివున్నాయి. వజ్రాలు, జాతిరత్నాలు కనిపించలేదు.. దీంతో ఆయన ఎల్బీ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక ఇదిలా ఉంటే నగర శివార్లలో దొంగల బెడద ఎక్కువైంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది.

రూ. 32 లక్షల విలువైన 94 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ కేసులో యూపీకి చెందిన భరత్ భూషణ్ భన్సల్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్తు ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై వివిధ రాష్ట్రాల్లో 60కి పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు.