మిలాద్ ఉన్ నబీ : పాతబస్తీలో దారి మళ్లింపు

  • Published By: madhu ,Published On : November 10, 2019 / 02:26 AM IST
మిలాద్ ఉన్ నబీ : పాతబస్తీలో దారి మళ్లింపు

మిలాద్ ఉన్ నబీ వేడుకలకు నగరం ముస్తాబైంది. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం పలు ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, అన్నదానాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మజ్లీస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దారుస్సలాలంలో భారీ బహిరంగ సభ జరిటగింది. మక్కా మసీదు, చార్ కమాన్‌తో పాటు ప్రధాన రోడ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో..పోలీసులు పలు ఆంక్షలు విదించారు. పలు ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు, డీజేలకు అనుమతిని నిరాకరించారు. సున్నీ యునైటెడ్ ఫోరం ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మక్కా మసీదు నుంచి ర్యాలీ తీయనున్నారు. చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, దారుషిఫా, మీరాలంమండి, బీబీ బజార్ చౌరస్తా, మొఘల్ పురా ప్లే గ్రౌండ్ వరకు సాగనుంది. ఇక్కడ జరిగే..బహిరంగసభతో ఉత్సవాలు ముగుస్తాయి. 

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా..పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్..సాలర్ జాంగ్ మ్యూజియంతో పాటు ఖిల్వత్ ఉర్దూ మస్కాన్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. ర్యాలీలు, సభల్లో డీజేలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఆదివారం నిర్వహించే ర్యాలీల సందర్భంగా నగరంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా..వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 

> శాలిబండ క్రాస్ రోడ్డు నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను ఖిల్వత్, నాగుల చింత, మొగల్ పురా ద్వారా వెళ్లాలి. 
> చార్మినార్, మోతిగల్లీ వైపు వాహనాలకు అనుమతి లేదు. మూసాబౌలి, ఓల్గా హోటల్ ద్వారా దారి మళ్లించనున్నారు. 
> గుల్జార్ హౌజ్ నుంచి చార్మినార్ వరకు వాహనాలకు అనుమతి లేదు. మిట్టికా షేర్, పంజేషాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 
> మక్కా మసీదు నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ మదీనాకు చేరుకొనే వెంటనే..సిటీ కాలేజీ, ఢిల్లీ దర్వాజా వైపు వచ్చే వెహికల్స్‌ను బేగంబజార్, మూసాబౌలీ మీదుగా పంపిస్తారు. 
> అఫ్జల్ గంజ్, నయాపూల్ వైపు వచ్చే వాహనాలను శివాజీ బ్రిడ్జీ మీదుగా దారి మళ్లించనున్నారు. 
> ర్యాలీ దారుషిఫా చేరిన వెంటనే డబీర్ పురా నుంచి వచ్చే వామనాలను పురానీ హవేలీలోని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వైపు మళ్లిస్తారు. 
> మొఘల్ పురా ఓల్టా హోల్ వైపుకు చేరితే..హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను శాలిబండ చౌరస్తా మీదుగా సుల్తాన్ షాహీ వైపు పంపిస్తారు. 
> చాదర్ ఘాట్, నల్గొండ చౌరస్తా, రంగ్ మహల్, ఎంజే మార్కెట్ మీదుగా  ఆర్టీసీ బస్సులు వెళ్లాల్సి ఉంటుంది. 
Read More : నమో నరసింహ : యాదాద్రి చుట్టూ డబుల్ రోడ్లు