అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నిందుతుడు మహ్మద్ పహిల్వాన్ గుండెపోటుతో మృతి

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 05:49 AM IST
అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నిందుతుడు మహ్మద్ పహిల్వాన్ గుండెపోటుతో మృతి

MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం చేసిన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ (60) గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో మృతి చెందాడు. గుండెపోటు వచ్చి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం (ఫిబ్రవరి 11,2020)ఉదయం మృతి చెందాడు.

2011 ఏప్రిల్‌లో మహ్మద్ పహిల్వాన్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీపై పాతబస్తీలోని బార్కస్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారు.  వీరి మధ్య ఉన్న పాత కక్షలతో మహ్మద్ పహిల్వాన్‌ అక్బరుద్దీన్ ను చంపాలనుకున్నాడు. తుపాకీతో కాల్చారు. ఈ దాడిలో అక్బరుద్దీన్ ఒవైసీ అత్యంత తీవ్రంగా గాయపడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లారు.

ఈ దాడిలో అక్బరుద్దీన్ ఒవైసీ అత్యంత తీవ్రంగా గాయపడిl అక్బరుద్దీన్ మూడేళ్లపాటు ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. అయినా ఆయన శరీరంలో ఇంకా ఓ బుల్లెట్ అలాగే ఉండిపోయింది. ఈ దాడి తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ.. అక్బరుద్దీన్ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. అయినా..2019 ఎన్నికల్లో చంద్రయాంగుట్ట ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలుపు సాధించారు. ఇటీవల ఆయన చికిత్స కోసం కుటుంబసమేతంగా లండన్‌ వెళ్లారు. 

అక్బరుద్దీన్‌పై దాడి తర్వాత అరెస్ట్ అయిన మొహమ్మద్ పహిల్వాన్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ ఇవ్వకపోవడంతో సుప్రీం కోర్టు వరకూ వెళ్లి ఎట్టకేలకూ బెయిల్ సాధించాడు. బెయిల్ అనంతరం  మహమ్మద్ పహిల్వాన్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. బెయిల్ పై వచ్చిన పహిల్వాన్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చి హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పహిల్వాన్‌కు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు..ఒక సోదరితో పాటు ఏడుగురు సోదరులు కూడా ఉన్నారు. 

పహిల్వాన్ పై అక్బరుద్దీన్ పై హత్యా ప్రయత్నం కేసు మాత్రమే కాక..బర్కాస్, బండ్లగుడ, షాహీన్ నగర్ ప్రాంతాల్లో భూ కబ్జా ఆరోపణలపై కేసులు ఉన్నాయి. పహిల్వాన్ 10వ తరగతి చదివాడు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పహిల్వాన్ మంచి పట్టు సాధించాడు.