హైదరాబాద్‌‌లో భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌‌లో భారీ వర్షాలపై కేటీఆర్ సమీక్ష

Hyderabad వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలిచ్చారు. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

వరద బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలి. ఓపెన్‌ నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి. ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటూ మంత్రి కేటీఆర్‌ సలహాలిచ్చారు.



వరదకు నష్టం ఎక్కువగా ఉన్న మూసారాంబాగ్‌ ప్రాంతాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌ సందర్శించారు. ప్రమాదాల నివారణకు రెండు వైపులా బారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తక్షణమే సహాయం అందించేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటుకోసం ఆర్డర్ ఇచ్చారు.