Munawar Faruqui: మునావర్ షో జరిగేనా.. శిల్పకళా వేదిక వద్ద భారీ బందోబస్తు

మునావర్ ఫారుఖీ కామెడీ షో విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. సాయంత్రం షో జరుగుతుందా.. లేదా అనే అనుమానాలున్నాయి. ఎలాగైనా షోను అడ్డుకుని తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. షో జరిగే శిల్పకళా వేదిక వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

Munawar Faruqui: మునావర్ షో జరిగేనా.. శిల్పకళా వేదిక వద్ద భారీ బందోబస్తు

Munawar Faruqui: స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ శనివారం నిర్వహించనున్న షో విషయంలో సందిగ్ధత నెలకొంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ రోజు మునావర్ షో జరగాల్సి ఉంది. అయితే, బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో ఈ షో విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఈ షో జరుగుతుందా.. లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. మునావర్ షో నిర్వహిస్తే దాడి చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.

Boycott Amazon: అభ్యంతరకర కృష్ణుడి చిత్రాలు అమ్ముతున్న అమెజాన్.. బాయ్‌కాట్ చేస్తామంటున్న నెటిజన్స్

బీజేపీ ప్రకటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. షో జరిగే శిల్పకళా వేదిక వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు. ఆర్మ్‌డ్ రిజర్వ్, ఎస్ఓటీ, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ షో కు అనుమతులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఎవరైనా అశాంతి సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం షో మొదలై.. ముగిసే వరకు అన్ని చోట్లా పోలీసుల భద్రత ఉంటుందన్నారు. మరోవైపు షో నిర్వాహకులు ఇంకా వేదికకు డబ్బులు చెల్లించలేదు. కాగా, ఈ షోను ఎలాగైనా అడ్డుకుని తీరుతామని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Landlords Murder: మందు తాగొద్దన్నందుకు ఇంటి యజమాని హత్య.. మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు

ముందు జాగ్రత్త చర్యగా రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు లాలాగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ షోకు సైబరాబాద్ పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ‘‘మునావర్ పర్యటనను మేము ముందునుంచీ వ్యతిరేకిస్తున్నాం. కేటీఆర్ పిలవడం వల్లే మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వచ్చి షో చేస్తున్నారు. మునావర్ షోను ఇతర రాష్ట్రాల్లో వివిధ పార్టీలు అడ్డుకున్నాయి. మునావర్ షోకు రామభక్తులు వెళ్లి, వాళ్ల బలం రుజువు చేయాలి. పోలీసులు ఒక గంట అనుమతిస్తే పార్టీని పక్కనబెట్టి, హిందువుగా నేనేంటో చూపిస్తా’’ అని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.