బాక్సులో భవిష్యత్ : మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 07:38 PM IST
బాక్సులో భవిష్యత్ : మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 7 వేల 613 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అటు శనివారం కౌంటింగ్‌ జరగనుంది.

120 మున్సిపాల్టీల్లోని 2 వేల 727 వార్డులకు గాను ఇప్పటికే 80 ఏకగ్రీవమయ్యాయి. 2 వేల 647 వార్డులకు పోలింగ్‌ జరిగింది. 9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు గాను ఒక డివిజన్‌ ఏకగ్రీవమైంది. 324 డివిజన్లకు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారుల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతం తగ్గింది. దొంగ ఓట్లు పడకుండా కొంపల్లిలో తొలిసారిగా ఫేస్‌ రికగ్నైజేషన్ యాప్‌ వినియోగించారు ఎన్నికల అధికారులు.

బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు శనివారం కౌంటింగ్‌ జరగనుంది. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

పోలింగ్ సందర్భంగా పలు చోట్ల అధికారపార్టీ, విపక్షాల మధ్య వాగ్వాదాలకు దిగారు. పరస్పర దాడులు చేసుకున్నారు.  నిజామాబాద్‌లోని 41  వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీ లో  టీఆర్ఎస్-బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు ఇరుపార్టీల నేతలను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఎంఐఎం నేతలు ఓటర్లను ప్రలోభపెట్టడంతో కాంగ్రెస్ నేత శంకర్ వారితో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో శంకర్ కాలికి గాయాలయ్యాయి.  

రంగా రెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ 8 వ వార్డు లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన ఇద్దరిని కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు.  వారి దగ్గరి నుంచి నకిలీ ఓటర్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీలో డబ్బులు పంపిణీ చేస్తోన్న టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు. టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. డబ్బులు పంచుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు కరీంనగర్‌ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అక్కడ 60 కార్పొరేట్‌ స్థానాలకు రెండు ఏకగ్రవమయ్యాయి. 58 డివిజన్లకు ఈ నెల 24న పోలింగ్‌ జరగనుంది. కరీంనగర్‌లో ఈ నెల 27న  ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.