రోగులకు గుడ్ న్యూస్ : ఆదివారాల్లోనూ ఓపీ సేవలు

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 03:42 AM IST
రోగులకు గుడ్ న్యూస్ : ఆదివారాల్లోనూ ఓపీ సేవలు

రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. విష జ్వరాలు, వ్యాధులు ప్రబలుతుండడంతో రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రద్దీ అధికంగా ఉంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఆదివారాల్లోనూ ఓపీ సేవలు పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఆదివారాలు ఓపీ కేంద్రాలు తెరచి ఉంచి రోగులకు వైద్య సేవలు అందచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. అవసరమైతే రోగుల పరిస్థితిని బట్టి ఇన్ పేషెంట్లుగా చేర్చుకుంటామని, రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫీవర్, నీలోఫర్ సహా అన్ని బోధనాసుపత్రుల్లోనూ ఆదివారం సహా ఇతర సెలవు దినాల్లోనూ జనరల్ మెడిసన్ ఓపీ సేవలు అందించనున్నారు. 

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సిబ్బంది ఉండనున్నారు. ఆదివారం ఓపీ సేవలు అందించడం ఇదే ప్రథమమని..ప్రత్యేక పరిస్థితుల్లోనూ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని..ప్రభుత్వ వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజు తర్వాత..ఆయా ఆస్పత్రులకు వైద్యులు, పడకల సంఖ్యకు అధికంగా రోగుల తాకిడి అధికంగా ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

ఓపీ సేవలు ఆదివారం కూడా పనిచేస్తే వీటికి చెక్ పెట్టవచ్చని వైద్య ఆరోగ్య శాఖ భావించింది. అన్ని విభాగాలు కాకుండా..కేవలం సీజనల్ వ్యాదులకు చికిత్సలు అందించే జనరల్ మెడిసన్ విభాగం వైద్యులు, ఫార్మసిస్టులు, వ్యాధి నిర్దారణ చేసేందుకు అవసరమైన టెక్నీషియన్లకు తాత్కాలికంగా సెలవులు రద్దు చేసింది. 

Read More :  రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్ : EKYC చేయకున్నా సరుకులు