అసలేం జరిగింది : పాకిస్తాన్ పోలీసుల అదుపులో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 03:04 PM IST
అసలేం జరిగింది : పాకిస్తాన్ పోలీసుల అదుపులో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్

ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్ స్నేహితుడు దారిలాల్. మహారాష్ట్ర వాసి. 

అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారంటూ.. ఆ ఇద్దరిని పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా, పాస్‌ పోర్టు లేకుండా పాకిస్తాన్‌లోని కొలిస్తాన్ ఎడారిలోకి ప్రవేశించేందుకు యత్నించారని బహావల్ పూర్‌ దగ్గర పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రశాంత్ … పాకిస్తాన్‌లోకి వెళ్లి అక్కడి పోలీసులకు పట్టుబడడం వెనుక ఓ లవ్‌స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పోలీసులకు ప్రశాంత్‌ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే… ఓ అమ్మాయిని ప్రశాంత్ ప్రేమించాడు. ఆ అమ్మాయి కొంతకాలం క్రితం ప్రశాంత్‌ను వదిలేసి వెళ్లిపోయింది. గూగుల్‌లో ఆమె కోసం సెర్చ్‌ చేసిన ప్రశాంత్‌.. ఆమె స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. 

అయితే.. గూగుల్ మ్యాప్‌లో లొకేషన్‌.. రాజస్తాన్‌ సరిహద్దుల్లో చూపించడంతో.. తన స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లాడు. రాత్రి వేళ సరిహద్దులూ దాటాడు. ఆ ప్రయత్నంలో అక్కడ గస్తీ తిరుగుతున్న పోలీసులకు దొరికిపోయాడు.

కాగా.. వీరి అరెస్ట్ కి సంబంధించి పాకిస్తాన్ ఇంతవరకు భారత ఎంబసీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై ఉగ్రవాదులు అనే ముద్ర వేసే ప్రయత్నంలో పాక్ ఉందని తెలుస్తోంది. ఉగ్రదాడులు చేసేందుకు పాక్ లోకి చొరబొడ్డారని ఆరోపిస్తూ ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు స్థానిక న్యూస్ చానళ్లలో కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.