కరోనా పేషెంట్లకు ప్లాస్మానే అమృతం.. సంజీవని : చిరంజీవి

  • Published By: sreehari ,Published On : August 7, 2020 / 05:58 PM IST
కరోనా పేషెంట్లకు ప్లాస్మానే అమృతం.. సంజీవని : చిరంజీవి

కరోనా పేషెంట్లకు ప్లాస్మానే అమృతం..సంజీవని అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.. కరోనా నుంచి కోలుకున్నవారు తప్పకుండా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా డొనేషన్ పై అపోహలు వద్దన్నారు.. ప్లాస్మా డొనేషన్ పై ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్మా దానం చేస్తే.. ఎలాంటి రక్తాన్ని కోల్పోరని చెప్పారు.

ప్లాస్మా ఇచ్చిన 22 గంటల్లో మళ్లీ మీలో అది సమకూరుతుందని చెప్పారు. పాస్మా దానం వల్ల కోవిడ్‌ బారినపడ్డవారిని ఆదుకున్నవారమవుతామని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషరేట్ పరిధిలో ప్లాస్మా దానం చేసిన పోలీసులు, వారి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.



22 ఏళ్ల క్రితం నాకు సామాజిక బాధ్యత తెలియని సమయంలో ఒక వార్తా చూసి చలించి పోయానని చెప్పారు చిరంజీవి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఎంతోమంది రక్తం దొరక్క ణాలు కోల్పోతున్నారని అందుకే తాను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అభిమానుల ప్రోత్సాహంతో నిత్యం రక్త దానం చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు కూడా ఇచ్చిందన్నారు. కోవిడ్ పరిస్థితిల్లో అసలైన ఆయుధం ఫ్లాస్మా దానమే అన్నారు.

రెండు రోజుల క్రితమే తమ సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యిందని చెప్పారు. వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తిని ఫ్లాస్మా దానం చేయమని చెప్పాను. అతను ప్లాస్మా దానం చేయడంతో మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడు.



మా ఇంట్లో, నా దగ్గర పని చేసే వర్కర్స్‌కి నలుగురికి కరోనా సోకింది. వంట మనిషి శ్రీను, స్విమ్మింగ్ లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇప్పుడు వారందరు కోవిడ్ నుండి కోలుకుని పనిలో చేరారు. వాళ్ల ప్లాస్మా ఇవ్వడానికి తీసుకొచ్చాను.

ఇంట్లో అందరూ భౌతిక దూరం పాటిస్తున్నాం. బయటకు దగ్గాలంటే భయమే స్తోందన్నారు. భౌతిక దూరం అనేది భార్యాభర్తలను కూడా విడదీసిందన్నారు. కోవిడ్ నుండి కోలుకున్నవారంతా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ఫ్లాస్మానే మనల్ని రక్షిస్తుందని చిరంజీవి తెలిపారు.