రామ్ చరణ్ పెద్ద మనసు : అభిమాని కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థికసాయం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్నారు. వీరాభిమాని కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ఆ కుటుంబానికి రూ.10లక్షలు

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 08:07 AM IST
రామ్ చరణ్ పెద్ద మనసు : అభిమాని కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థికసాయం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్నారు. వీరాభిమాని కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ఆ కుటుంబానికి రూ.10లక్షలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్నారు. వీరాభిమాని కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. ఆ కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారు. నెల క్రితం మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని, హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు.

నూర్ మహమ్మద్ మెగాస్టార్ చిరంజీవికి అభిమాని. హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పలు కార్యక్రమాల్లో నూర్ మహమ్మద్ పాల్గొన్నారు. నూర్ మహమ్మద్ మరణ వార్త తెలిసిన వెంటనే.. మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్ లోని నూర్ ఇంటికి స్వయంగా వెళ్లారు. నూర్ మహమ్మద్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు.

ఆ సమయంలో నూర్ మహ్మద్ కుటుంబానికి చిరంజీవి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న రామ్ చరణ్.. హైదరాబాద్ రాగానే నూర్ మహమ్మద్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రూ.10లక్షలు ఆర్థిక సాయం చేస్తానని చరణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను చరణ్ నిలుపుకున్నారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) ఉదయం నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చరణ్.. రూ.10 లక్షల చెక్కుని వారికిచ్చారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

1

ఈ విషయం తెలిసిన అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. దటీజ్ రామ్ చరణ్ అని ప్రశంసించారు. అభిమానుల శ్రేయస్సు కోసం మెగా ఫ్యామిలీ కట్టుబడి ఉంటుందని రామ్ చరణ్ మరోసారి నిరూపించారని కితాబిచ్చారు. చరణ్ చేసిన సాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని నూర్ మహ్మద్ కుటుంబసభ్యులు చెప్పారు.

మెగా ఫ్యాన్ గా నూర్ మహమ్మద్ చేసిన సేవలు ఎనలేనివని చరణ్ అన్నారు. నూర్ మహమ్మద్ కుటుంబసభ్యులతో దాదాపు 45 నిముషాలు గడిపారు చరణ్. నూర్ మహమ్మద్ చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు. నూర్ మహ్మద్ ని తిరిగి తీసుకు రాలేను, కానీ మీ ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటానని చరణ్ చెప్పారు. అదే విధంగా నూర్ మహ్మద్ కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని, అలాగే అమ్మాయిల పెళ్లిళ్లకు సాయం చేస్తానని ఆ కుటుంబానికి చరణ్ భరోసా ఇచ్చారు.