అసలేం జరిగింది : కాచిగూడలో ఇంటర్ సిటీని ఢీకొన్న MMTS

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 06:06 AM IST
అసలేం జరిగింది : కాచిగూడలో ఇంటర్ సిటీని ఢీకొన్న MMTS

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ ట్రైన్ ని ఎంఎంటీఎస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది.

రైలు ప్రమాదంలో మూడు బోగీలు పక్కకి ఒరిగాయి. దీంతో ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి ట్రాక్ పైకి తీసుకొచ్చే పనులు చేపట్టారు.

రైలు ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇంటర్ సిటీ ట్రైన్ ఆగి ఉన్న ట్రాక్ పైకి ఎంఎంటీఎస్ రైలు కూడా వచ్చేసింది. దీంతో యాక్సిడెంట్ జరిగింది. దీనిపై రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.