సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. కొత్త వారికి అవకావం కల్పించింది.

సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి : దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డి

సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. కొత్త వారికి అవకావం కల్పించింది.

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ మొండిచేయి చూపింది. కొత్త వారికి అవకావం కల్పించింది. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ స్థానంలో కిషన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనుంది. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన్ను సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపే అవకాశం కన్పిస్తోంది.
Read Also : అందరూ చౌకీదారులేనా! : అంబానీ కోసం చౌకీదార్ మోడీ రాఫెల్ డోర్ తెరిచాడు

అలాగే మల్కాజిగిరి నుండి ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మెదక్ నుండి రఘునందన్ రావుకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో ఈసారి ఎనిమిది స్థానాల్లో సిట్టింగ్ లకు అవకాశం ఇవ్వలేదు. కొత్త ముఖాలు బరిలోకి దిగే అవకాశం ఉంది. 

×