ఎండలు బాబోయ్ ఎండలు : పెరగనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

  • Published By: madhu ,Published On : March 25, 2019 / 12:56 AM IST
ఎండలు బాబోయ్ ఎండలు : పెరగనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యే సరికి ఎండలు ముదురుతున్నాయి. రాత్రి వేళల్లో ఉక్కపోత ఉంటోంది. దీనితో జనాలు అల్లాడిపోతున్నారు. కూలి, నాలి పని చేసుకొనే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. శీతలపానీయాలకు గిరాకీ పెరుగుతోంది. 
Read Also : ఎండల్లో తిరగొద్దు : ఏప్రిల్, మే ఎండలపై ఆందోళన

ఇక ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 25 సోమవారం, మార్చి 26 మంగళవారం కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మార్చి 24వ తేదీ ఆదివారం పలు జిల్లాల్లో టెంపరేచర్స్ గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లాల తొర్రూర్‌లో అత్యధికంగా 40.9 డిగ్రీలు, మల్లంపల్లిలో 40.8 డిగ్రీలు, వనపర్తి జిల్లా చిన్నంబాబి మండలం పెద్దదగడ, కామారెడ్డి జిల్లా బిక్ నూరు, మహబూబాబాద్ జిల్లా జానంపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.