తల్లీకూతుళ్లను చంపేసిన అల్లుడు..ఆర్థిక లావాదేవీలే హత్యలకు కారణమా?

10TV Telugu News

తల్లీ కూతుళ్లను దారుణం చంపాడు అల్లుడు. హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని ఘాజీమిల్లత్  నల్లవాగు ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ దారుణం జరిగింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం స్థానికులను ప్రశ్నిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ పాతబస్తీలు ఇద్దరు మహిళల దారుణం హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల వల్లనే ఈ దారుణం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తల్లీ ఫరీదా బేగంతో పాటు ఆమె కూతురు సైదా బేగంలను అల్లుడు వరస అయిన రెహమాన్ హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుడు రెహమాన్ కోసం గాలింపు చేపట్టిన క్రమంలో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించారు. ఈ హత్యలు చేసిన తరువాత రెహమాన్ నల్లవాగు గల్లీ నుంచి చాంద్రయణగుట్ట వైపుగా వెళ్తున్నట్లుగా గుర్తించారు. దీంతో రెండు టీమ్ లతో పోలీసులు రెహమాన్ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలు రెహమాన్ ఒక్కడే చేశాడా? లేక మరెవరైనా చేయించారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా మృతుల బంధువులను..స్థానికులను ప్రశ్నిస్తున్నారు. 

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్