Surgical Strikes 2.0 : హైదరాబాద్ అప్రమత్తం

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 04:30 AM IST
Surgical Strikes 2.0  : హైదరాబాద్ అప్రమత్తం

పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సైనిక శిబిరాల వద్ద భద్రతను మరింత పెంచారు. నగరంలో ఎన్నో రక్షణ సంస్థలున్న సంగతి తెలిసిందే. రక్షణ ఉత్పత్తులు, డీఆర్డీవో ప్రయోగశాలలున్నాయి. ఆయా సంస్థల వద్ద పోలీసులు నిఘా పెంచారు. పాక్ ఆక్రమిత భూభాగంలోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత వాయుసేన బాంబులేసి ధ్వంసం చేసింది. దీనితో సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

1971 యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా భారత వైమానికదళ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం నియంత్రణ రేఖను దాటాయి. పీఓకే గగనతలంలోకి దాదాపు 90కిలోమీటర్లు దూసుకెళ్లాయి. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్‌ గైడెడ్‌ బాంబుల వర్షం కురిపించింది. 350-400 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టి భారతదేశం ఉమ్మడి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 26 గణతంత్ర దినమైతే.. ఫిబ్రవరి 26ను రణతంత్ర దినంగా మార్చి విజయనాదం చేసింది. భారత సైన్యం తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు