భూముల అమ్మకాలకు లైన్ క్లియర్ : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 01:43 PM IST
భూముల అమ్మకాలకు లైన్ క్లియర్ : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) కేబినెట్ భేటీ అయ్యింది. హెచ్ఎండీఏ పరిధిలో భూముల విక్రయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భూముల అమ్మకంతో రూ.10వేల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప్పల్ బగాయత్ తరహాలో ల్యాండ్ పూలింగ్ కు వెంచర్లపై మొగ్గుచూపారు. 3 గంటలకుపైగా కొనసాగుతున్న కేబినెట్ భేటీలో రాష్ట్ర ఖజానాకు ఆదాయ మార్గాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపుపై డిస్కస్ చేస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
* 3 గంటలకు పైగా కేబినెట్ భేటీ
* రాష్ట్ర ఖజానాకు ఆదాయ మార్గాలపై ప్రత్యేక ఫోకస్
* భూముల మార్కెట్ విలువ పెంపుపై చర్చ
* హెచ్ఎండీఏ పరిధిలో భూముల అమ్మకాలకు కేబినెట్ లైన్ క్లియర్

* భూములు అమ్మి రూ.10వేల కోట్లు రాబట్టాలని నిర్ణయం
* ఉప్పల్ బగాయత్ తరహాలో ల్యాండ్ పూలింగ్ కు వెంచర్లు
* మోకిళ్ల, ప్రతాప సింగారం, మేడ్చల్ జిల్లా కొర్రెమెలలో వెంచర్లు
* రెవెన్యూ చట్ట సవరణపై అధికారులకు అవగాహన
* ఫిబ్రవరి 28న శంషాబాద్ లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించే ఛాన్స్

* తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పై చర్చ
* ఇకపై రోగులకు వైద్య పరీక్షలు ఫ్రీ
* దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ప్రభుత్వం పింఛన్