నీలి విప్లవానికి శ్రీకారం: హైదరాబాద్ లో చేపల పెంపకం 

  • Published By: veegamteam ,Published On : August 26, 2019 / 05:47 AM IST
నీలి విప్లవానికి శ్రీకారం: హైదరాబాద్ లో చేపల పెంపకం 

నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింటి తెలంగాణ ప్రభుత్వం. చేపల వేటే ప్రధాన ఆదాయంగా జీవించే మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మహా నగరం అయిన హైదరాబాద్‌లో కూడా చేపల పెంపకాన్ని చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో చేపల పిల్లల్ని  మత్య్సకారులకు ఇచ్చి వాటిద్వారా జీవనోపాథిని కల్పిస్తోంది. జిల్లాలోనే కాకు హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెరువుల్లో కూడా చేపల్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో  గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ చెరువులో చేపల్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. 2018లో ఇబ్రహీంబాగ్ చెరువులో60 వేల చేప పిల్లలు వేసి పెచింది ప్రభుత్వం. అది మంచి ఫలితాలనిచ్చింది. దీంతో 2019లో కూడా ఈ చెరువులో చేపల్ని పెంచేందుకు చెరువును నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చెరువు  సగం వరకు నిండింది.  త్వరలోనే పూర్తిగా నిండే అవకాశముంది. నీళ్లు పూర్తిస్థాయికి చేరుకున్న అనంతరం 60వేల చేప పిల్లలు చెరువులో పెంచనుంది. 

హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 176 చెరువుల్లో కూడా పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రేటర్ పరిధిలో ఉన్న వందలాది చిన్నా..చితకా చెరువుల్లో చేపలు పెంచే వీలు లేదు. అవన్నీ ప్లాస్టిక్ వంటి వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో వీటిల్లో చేపల పెంపకానికి వీలుపడటం లేదు. ఇబ్రహీంబాగ్ చెరువు నగరానికి చివరన ఉండటంతో వ్యర్థాల సమస్యలేకుండా ఉంది. దీంత చేపలు చక్కగా పెరిగే వీలుండటంతో చేపల్ని పెంచుతున్నారు. 208లో వేసిన 60వేల చేపపిల్లలు చక్కగా పెరిగి..మత్య్సకార సహాకార సంఘానికి చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.  దీంతో 2019లో కూడా దాన్ని కొనసాగిస్తోంది ప్రభుత్వం. 

రంగారెడ్డి జిల్లా నుంచి 60 వేల చేపపిల్లలను తెప్పించి..ఇబ్రహీంబాగ్ చెరువులో వేయనున్నారు. నగరంలో 15 మత్య్సకార సహాకార సంఘాలు, మరో 4 మత్స్యకార మార్కెటింగ్ సహాకారసొసైటీలున్నాయి. వీటిలో 1422 మంది సభ్యులున్నారు. మరో 20 మత్స్యకార మహిళా సహాకార సొసైటీలుండగా, వీటిలో 1349 మంది సభ్యులున్నారు. అంతేకాదు..మత్స్య మిత్ర పేరుతో 84 స్వయం సహాయక గ్రూపులు కూడా ఉన్నాయి. వీరంతా మత్స్యసంపదమీదే ఆదారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను అందజేయడంతో..మార్కెట్లకు చేరి వీరికి మంచి ఉపాధి మార్గంగా మారింది.