రిలీఫ్ : గర్భిణి SI అభ్యర్థులకు ఫిట్‌నెస్ టెస్ట్ అవసరం లేదు

ఎస్ఐ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న గర్భిణి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గర్భిణులకు ఫిట్‌నెస్ పరీక్షలు అవసరం లేదని కోర్టు చెప్పింది.

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 06:40 AM IST
రిలీఫ్ : గర్భిణి SI అభ్యర్థులకు ఫిట్‌నెస్ టెస్ట్ అవసరం లేదు

ఎస్ఐ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న గర్భిణి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గర్భిణులకు ఫిట్‌నెస్ పరీక్షలు అవసరం లేదని కోర్టు చెప్పింది.

హైదరాబాద్ : ఎస్ఐ పరీక్షలకు అప్లయ్ చేసుకున్న గర్భిణి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గర్భిణులకు ఫిట్‌నెస్ పరీక్షలు అవసరం లేదని కోర్టు చెప్పింది. వారికి ఎలాంటి ఫిట్‌నెస్ పరీక్షలు పెట్టకుండా నేరుగా ఫైనల్ రాత పరీక్షలకు అనుమతించాలని తెలంగాణ హోంశాఖ విభాగం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఫైనల్ ఎగ్జామ్ రిజల్స్ట్ వచ్చాక నెల రోజుల్లో ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని కోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలు ఈ నోటిఫికేషన్‌కు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది.
Read Also : ఓడిపోతామనే భయంతోనే ప్రేలాపనలు : తలసాని

సూర్యాపేట జిల్లా నూతన్ కల్‌కు చెందిన ప్రమీల హైకోర్టుని ఆశ్రయించింది. గర్భిణి అభ్యర్థులకు ఫిట్‌నెస్ పరీక్షలు లేకుండానే రాతపరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పోలీసు శాఖ విభాగంలో పలు పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఐ జాబ్‌కి ప్రమీల అప్లయ్ చేసుకుంది.

ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించింది. ఇప్పుడు ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఇందులో భాగంగా 100 మీటర్లు పరిగెత్తాలి. లాంగ్ జంప్, షార్ట్ పుట్ టెస్టులకు హాజరవ్వాలి. ఇవన్నీ పాస్ అయితేనే తుది రాత పరీక్షలకు అనుమతిస్తారు. ప్రమీల ప్రస్తుతం 6 నెలల ప్రెగ్నెంట్. గర్భిణి కావడంతో ఇవన్నీ చెయ్యడం కష్టం. దీంతో ఆమె ఉన్నతాధికారులను సంప్రదించింది. ఫిట్ నెస్ టెస్ట్ లేకుండానే పరీక్షలకు అనుమతించాలని రిక్వెస్ట్ చేసింది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ప్రమీల హైకోర్టుని ఆశ్రయించింది. ప్రమీల పిటిషన్ ను విచారించిన కోర్టు ఫిట్ నెట్ టెస్టులు అవసరం లేదని చెప్పింది.
Read Also : ఉత్సాహం తగ్గించుకోండి : టిక్ టాక్‌కు ఏజ్ లిమిట్, 60లక్షల వీడియోలు డిలీట్