మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి : నాగిరెడ్డి

అక్టోబర్ 31, 2019 హైకోర్టులో తీర్పు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 03:31 PM IST
మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి : నాగిరెడ్డి

అక్టోబర్ 31, 2019 హైకోర్టులో తీర్పు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.

అక్టోబర్ 31, 2019 హైకోర్టులో తీర్పు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలుండే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. మంగళవారం (అక్టోబర్ 29, 2019) జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ తొలివారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మీర్‌పేట కార్పొరేషన్‌లో వార్డుల విభజన జరుగకపోవడంతో అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. మొత్తం 3 వేల 103 వార్డుల్లో ఎన్నికల నిర్వహించనున్నట్లు చెప్పారు. 8 వేల56 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో అభ్యర్థి ఖర్చు రూ. లక్ష, కార్పొరేషన్‌లో అభ్యర్థి ఖర్చు రూ. లక్షా 50 వేలు మించకుండా ఉండాలన్నారు.

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మొత్తం ఓటర్ల సంఖ్య 79 లక్షల 92 వేల 434 అని వెల్లడించారు. ఇటీవలే హుజూర్‌నగర్ ఉపఎన్నిక జరిగిన క్రమంలో హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్క వేయాలని నిర్ణయించినట్లు కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఖాళీగా ఉన్న స్థానాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోవాలని ఆదేశించారు.