రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని TRS MP నామా డిమాండ్

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 08:59 AM IST
రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని TRS MP నామా డిమాండ్

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంపీ నామా లోక్‌సభలో ప్రస్తావించారు.నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లు గప్పి రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీశారనీ..ఇటువంటివి ప్రైవసీని దెబ్బతీసే యత్నాలని అటువంటి వీడియోలు చేసిన రేవంత్ రెడ్డిని ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నామా కోరారు. 

మంత్రి కేటీఆర్ ఫార్మ్ హౌస్‌ పైకి డ్రోన్ కెమరాను పంపించిన కేసులో నార్సింగి పోలీసులు రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం (మార్చి 5) మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్ రెడ్డిని గురువారం (మార్చి 5,2020) మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కోర్టు రేవంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

అరెస్టై జైల్లో ఉన్న మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని మరో పిటిషన్‌లో కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున తక్షణం బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు.(రేవంత్‌‌రెడ్డిపై VH ఫైర్: ఈ డ్రోన్ కెమెరాల రచ్చేందీ..ఈ గోలేంది రేవంతూ..)

రేవంత్ కేసులను కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ టీమ్ వాదించనుంది. సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలో లాయర్లు బృందం హైదరాబాద్ వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం చొరవ తీసుకుని రేవంత్ రెడ్డి కేసులను వాదించేందుకు సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందాన్ని హైదరాబాద్ పంపినట్లు తెలుస్తోంది.

కాగా..గండిపేట చెరువుకు వెళ్లే దారిలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం (మార్చి 2) మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ‍ఆర్‌ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో కేటీఆర్ ఫార్మ్‌హౌస్‌ను కొంత మంది డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించటం వంటి పరిణామాలతో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.