లోక్ సభ ఎన్నికలకు సిద్ధమా : అయితే ఓటు నమోదు చేసుకోండి

  • Published By: madhu ,Published On : March 2, 2019 / 03:15 AM IST
లోక్ సభ ఎన్నికలకు సిద్ధమా : అయితే ఓటు నమోదు చేసుకోండి

‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03 తేదీల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. మార్చి 01వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారిని (బీఎల్ఓ)ని సంప్రదించాలని సూచించింది.

ఓటర్ల జాబితా, ఫారం – 6, 7, 8 & 8ఎలు లభిస్తాయని, నమోదు కోసం ఓటర్లు రెండు కలర్ ఫొటోలు, గృహ /  వయస్సు (జనవరి 2019కి 18 సంవత్సరాలు నిండాలి) ధృవీకరణపత్రాలు తీసుకరావాలని సూచించింది. ఓటరుగా జాబితాలో పేరు లేనట్లయితే ఫారం – 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్ www.nvsp.in లో నమోదు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఎన్నికల వివరాలు తెలుసుకొనేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఏర్పాటు చేసినట్లు..అన్ని పని దినాల్లో ఉదయం 9 నుండి రాత్రి 9గంటల వరకు టోల్ ప్రీ పనిచేస్తుందని తెలిపింది.