న్యూ ఇయర్ రోజు ఇంట్లోనే : హైదరాబాద్ కుర్రాళ్లకు ఎంతకష్టం వచ్చింది!

  • Published By: sreehari ,Published On : December 23, 2019 / 08:31 AM IST
న్యూ ఇయర్ రోజు ఇంట్లోనే : హైదరాబాద్ కుర్రాళ్లకు ఎంతకష్టం వచ్చింది!

నగర యువత.. పారా హుషార్.. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కొత్త ఏడాదికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2019కి గుడ్ బై చెప్పేసి.. 2020కి వెల్ కమ్ చెప్పేందుకు నగర యువతంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే నగర యువతంతా న్యూ ఇయర్ పార్టీల కోసం రెడీ అయిపోతున్నారు. ముందుగానే ఎక్కడికి వెళ్లాలి ఇయర్ ఎండ్ పార్టీ ఎలా జరుపుకోవాలి అని ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రతిఏడాది స్నేహితులతో, ఫ్యామిలీలతో పాటు ప్రత్యేకించి ప్రేమజంటలన్నీ ఎంతో ఉత్సాహంగా ఇయర్ ఎండ్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఈసారి కూడా నగర యువత అదే న్యూ ఇయర్ జోష్‌తో ఎంజాయ్ చేయాలని ఆత్రుతగా వెయిట్ చేస్తోంది.

రోడ్లపై తిరిగితే అంతే :
2020 న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నగర పోలీసు యంత్రాంగం కూడా కసరత్తు చేస్తోంది. ప్రత్యేకించి యువత ప్రతి మూవెంట్‌పై నిఘా పెట్టనుంది. ప్రధాన రహదారుల్లో కావొచ్చు.. ఏదైనా న్యూ ఇయర్ పార్టీల దగ్గర కావొచ్చు… అడుగడుగునా ఓ కన్నేసి ఉంచనుంది. ఎప్పటిలానే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు పలు ఆంక్షలను కూడా విధించే అవకాశాలు ఉన్నాయి.

నగర వీధుల్లో కనిపించే యువతపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అంటే.. న్యూ ఇయర్ రోజున ఎక్కువ మంది యువత కలిసి ఒకే చోట గుంపుగా రోడ్లపై పార్టీలు చేయడం కుదరదు. కనీసం న్యూ ఇయర్ పార్టీలకు వెళ్లేందుకు కూడా యువతపై రిస్ట్రక్షషన్స్ పెట్టే అవకాశం ఉంది. కొత్త ఏడాది సంబరాల్లో చాలామంది యువత మద్యం సేవించే అవకాశం ఉండటంతో గొడవలకు దారితీసే అవకాశాలు ఉంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నగర శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం స్ట్రిక్ రూల్స్ అమల్లోకి తీసుకురానున్నాయి. న్యూ ఇయర్ రోజున డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటేవరకు ఆంక్షలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి యువతను అసలు న్యూ ఇయర్ పార్టీలకు రాకుండా ఉండేలా రూల్స్ తీసుకొస్తున్నట్టు సమాచారం.

యువతకు నో ఎంట్రీ : దంపతులకు మాత్రమే :
నగర యువత లేకుండా న్యూ ఇయర్ పార్టీలను ఊహించుకోలేని పరిస్థితి.. న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలు.. పబ్బుల్లో, క్లబుల్లో డీజేల సాంగులకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేసే కుర్రాళ్లతో కిటకిటా లాడాల్సిందే. 2020 కొత్త ఏడాది సంబరాల్లో నగర యువతకు ఎంట్రీ ఉండకపోవచ్చు.

ఫ్యామిలీల్లో ఒక కుర్రాడు ఉన్నా నాట్ అలోడ్ అంట. కుర్రాళ్లు కనిపిస్తే చాలు.. ఇక నో ఎంట్రీ బోర్డులు దర్శనం కానున్నాయి. కుటుంబాల్లో నుంచి దంపతులకు మాత్రమే న్యూ ఇయర్ పార్టీలకు ఎంట్రీ ఇవ్వనున్నారు. యువతతో కళకళలాడే పబ్బులు, క్లబులు, బార్‌లన్నీ యువత లేకుండా బోసిపోనున్నాయి.

న్యూ ఇయర్ రోజున నగర కుర్రాళ్లంతా ఇక ఇంట్లో ఉండే పరిస్థితి కనిపిస్తోంది. న్యూ ఇయర్ పార్టీ జరిగే ప్రతి లొకేషన్‌లో అక్కడి నిర్వాహకులకు ఇదే రూల్స్ అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ కానున్నాయి. ఏది ఏమైనా, న్యూ ఇయర్ పార్టీలో చిందేస్తూ ఎంజాయ్ చేయాల్సిన నగర యువతను కేవలం ఇంటికే పరిమితం కావడం చూసేవారికి.. అయ్యో.. పాపం ఎంత పెద్ద కష్టం వచ్చిందో హైదరాబాద్ యువతకు అనడం తప్ప చేసేదేమీ ఉండదు.