YouTube Channels Blocked: మరో 8 యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. 100 దాటిన సంఖ్య..

దేశంలో మరో ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ళను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ళ సంఖ్య 102కి చేరింది. తాజాగా, ఏడు భారతీయ, ఒక పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ కు వ్యతిరేకంగా అందులో కంటెంట్ ప్రసారం చేస్తుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

YouTube Channels Blocked: మరో 8 యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. 100 దాటిన సంఖ్య..

YouTube Channels Blocked

YouTube Channels Blocked: దేశంలో మరో ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ళను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ళ సంఖ్య 102కి చేరింది. తాజాగా, ఏడు భారతీయ, ఒక పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ కు వ్యతిరేకంగా అందులో కంటెంట్ ప్రసారం చేస్తుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.

అలాగే, ఓ ఫేస్ బుక్ ఖాతాను కూడా బ్లాక్ చేశామని, మరో రెండు పోస్టులను తొలగించామని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. 2021-ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను వాడి సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తాజాగా, బ్లాక్ చేసిన ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ళకు మొత్తం కలిపి దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారని, 114 కోట్ల వ్యూస్ ఉన్నాయని చెప్పింది.

భారత్ లోని మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఈ ఛానెళ్ళ కంటెంట్ ఉందని, అలాగే, తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారని పేర్కొంది. ఆన్ లైన్ లో న్యూస్ మీడియాలో అధికారిక, సురక్షిత, విశ్వసనీయమైన సమాచారం మాత్రమే ఉండాలన్న అంశానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది.

China-Taiwan conflict: తైవాన్ విషయంలో మరో నిర్ణయం తీసుకుని చైనాకు అసహనం తెప్పించిన అమెరికా