Assembly, Lok Sabha polls: లోక్‌సభ, 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తారక్‌లను పంపుతున్న బీజేపీ

దేశంలో త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. దాదాపు 3,000-3500 విస్తారక్ లను దేశంలోని పలు ప్రాంతాలకు పంపి, పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రణాళికలు వేసుకుంది. రాజకీయ పార్టీలకు ఈ ఏడాది చాలా కీలకం.

Assembly, Lok Sabha polls: లోక్‌సభ, 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తారక్‌లను పంపుతున్న బీజేపీ

BJP U turn on MCD mayor polls

Assembly, Lok Sabha polls: దేశంలో త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. దాదాపు 3,000-3500 విస్తారక్ లను దేశంలోని పలు ప్రాంతాలకు పంపి, పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రణాళికలు వేసుకుంది. రాజకీయ పార్టీలకు ఈ ఏడాది చాలా కీలకం.

ఎందుకంటే మొత్తం తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్, త్రిపుర, కర్ణాటక, మేఘాలయా, నాగాలాండ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఆరు రాష్ట్రాల్లో (పొత్తులతో కలిపి) బీజేపీ అధికారంలో ఉంది.

కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో, బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల్లోని తమ నేతలతో కలిసి తమ విస్తారక్ లు పనిచేస్తారని, నేరుగా కేంద్ర నాయకత్వానికి నివేదికలు అందిస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ బీజేపీ విస్తారక్ లను నియమించింది. అలాగే, కొన్ని రోజుల క్రితం దేశంలో బీజేపీ బలహీనంగా ఉన్న 160 లోక్ సభ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను విస్తారక్ లకు అప్పగించింది. బీజేపీ కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉంటోంది. వచ్చే ఎన్నికల్లోనూ పూర్తి మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Khushbu Sundar: బీజేపీ తమిళనాడులోని మహిళలు అందరూ సురక్షితంగానే ఉన్నారు: ఖుష్బూ