Khushbu Sundar: బీజేపీ తమిళనాడులోని మహిళలు అందరూ సురక్షితంగానే ఉన్నారు: ఖుష్బూ

బీజేపీ తమిళనాడు శాఖలోని మహిళలు అందరూ సురక్షితంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ సుందర్ అన్నారు. ఇటీవల తమిళనాడులో బీజేపీకి రాజీనామా చేస్తూ గాయత్రీ రఘురాం పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో తాను పనిచేయలేనని, తమ పార్టీ యూనిట్ లో మహిళలకు హక్కులు, గౌరవం లేవని అన్నారు.

Khushbu Sundar: బీజేపీ తమిళనాడులోని మహిళలు అందరూ సురక్షితంగానే ఉన్నారు: ఖుష్బూ

Khushbu Sundar

Khushbu Sundar: బీజేపీ తమిళనాడు శాఖలోని మహిళలు అందరూ సురక్షితంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ సుందర్ అన్నారు. ఇటీవల తమిళనాడులో బీజేపీకి రాజీనామా చేస్తూ గాయత్రీ రఘురాం పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో తాను పనిచేయలేనని, తమ పార్టీ యూనిట్ లో మహిళలకు హక్కులు, గౌరవం లేవని అన్నారు.

ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇవాళ ఖుష్బూ సుందర్ స్పందించారు. పార్టీ నుంచి వైదొలగింది మహిళలు అందరూ కాదని చెప్పారు. తాను కూడా పార్టీలోనే ఉన్నానని చమత్కరించారు. ఇవాళ ఖుష్బూ సుందర్ వెల్లలూరులో ఎద్దుల బండ్ల పోటీని ప్రారంభించి ఈ వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తమిళనాడు సంప్రదాయ పండుగ అని, అన్ని ఇళ్లలో సంతోషాన్ని నింపుతుందని చెప్పారు.

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సంక్రాంతి బహుమానం అంటూ చేసిన ప్రకటన సరికాదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చెరుకుగడ, రూ.1,000 భిక్షం వేసినట్లు ఉన్నాయని చెప్పారు. తాను ముంబైలో పుట్టినప్పటికీ, తమిళ మహిళనేనని, గత 36 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నానని అన్నారు.

కాగా, ఇటీవల బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు గాయత్రీ రఘురాం ప్రకటించారు. ఆమెను గత ఏడాది నవంబరు 23న బీజేపీ అన్ని పదవుల నుంచి ఆరు నెలలు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు అన్నామలై చెప్పారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డారని అన్నారు.