Family dispute: న‌లుగురు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

నలుగురు పిల్లలను బావిలో ప‌డేసింది ఓ త‌ల్లి. దీంతో వారు న‌లుగురు మృతి చెందారు. ఆ త‌ర్వాత ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ విషాద ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని అజ్మెర్ జిల్లాలోని మంగ‌ళియావాస్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివ‌రాలు తెలిపారు. కుటుంబ క‌ల‌హాల వ‌ల్ల మ‌తియా (32) అనే మ‌హిళ మ‌న‌స్తాపం చెందింది.

Family dispute: న‌లుగురు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
ad

Family dispute: నలుగురు పిల్లలను బావిలో ప‌డేసింది ఓ త‌ల్లి. దీంతో వారు న‌లుగురు మృతి చెందారు. ఆ త‌ర్వాత ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ విషాద ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని అజ్మెర్ జిల్లాలోని మంగ‌ళియావాస్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివ‌రాలు తెలిపారు. కుటుంబ క‌ల‌హాల వ‌ల్ల మ‌తియా (32) అనే మ‌హిళ మ‌న‌స్తాపం చెందింది.

గ‌త రాత్రి త‌న పిల్ల‌లు కోమ‌ల్ (4), రింకు (3), రాజ్ వీర్ (22 నెల‌లు), దేవ రాజ్ (నెల వ‌య‌సు)ను వెంట తీసుకుని ఆ బావి వ‌ద్ద‌కు వెళ్ళింది. న‌లుగురు పిల్ల‌ల‌ను బావిలోకి తోసేసి, అనంత‌రం ఆమె కూడా దూకింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు స‌మాచారం అందించి, బావిలో ఉన్న వారిని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌తియాను ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీశారు.

ఆమె న‌లుగురు పిల్ల‌లు మాత్రం మృతి చెందారు. వారిలో ముగ్గురు మృత‌దేహాల‌ను నిన్న సాయంత్రం తీశామ‌ని, నెల వ‌య‌సున్న దేవ రాజ్ మృత‌దేహాన్ని ఇవాళ ఉద‌యం బ‌య‌ట‌కు తీశామ‌ని పోలీసులు తెలిపారు. మ‌తియా భ‌ర్త బోదురాజ్ గుర్జార్ ఓ రైతు అని వివ‌రించారు. కుటుంబ క‌ల‌హాలతో విసిగిపోయిన మ‌తియా పిల్ల‌లతో పాటు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకుంద‌ని చెప్పారు.

Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం