ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు?

ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు?

Herd Immunity: దేశ రాజధాని ఢిల్లీలో రీసెంట్‌గా యాంటీబాడీ టెస్టింగ్ డేటా జరిగింది. దానిని బట్టి చూస్తే ఇండియాలో.. అతి త్వరలో హెర్డ్ ఇమ్యూనిటీ రాబోతున్నట్లు అనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఆగష్టు 2020 నుంచి యాంటీబాడీలు టెస్టులు రెగ్యూలర్ గా నిర్వహించి.. రాజధాని ప్రాంతంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసుకుంటుంది.

ఐదోది.. అతి పెద్దదైనటువంటి సర్వే చేసి జనవరి 11నుంచి జనవరి 22తేదీల మధ్యలో ఢిల్లీలోని 11జిల్లాల వ్యాప్తంగా 28వేల శాంపుల్స్‌ను సేకరించారు. ప్రాథమిక ఫలితాలను బట్టి.. ఢిల్లీలోని ఒక జిల్లాలో 60శాతం కంటే ఎక్కువ మంది యాంటీబాడీలు కలిగిన వారున్నట్లుగా గుర్తించారు. మిగిలిన జిల్లాల్లో యాంటీబాడీ రేట్ అనేది 50శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఒకవేళ ఈ ఫలితాలే నిజమైతే.. సగం సిటీ కరోనా నుంచి రికవరీ అయి.. 20మిలియన్ మంది సేఫ్ అయినట్లే అంటున్నారు. జనాభాలోని 60శాతం అంతకంటే ఎక్కువ మంది కరోనావైరస్ నుంచి కోలుకుని యాంటీబాడీస్ డెవలప్ చేసుకోగలిగితే.. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనని అంటున్నారు. అది పెరిగితే ఢిల్లీ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తి అనేది తగ్గిపోతుంది.

ఇండియాలో 10మిలియన్ కంటే ఎక్కువ మంది కరోనావైరస్ బారిన పడగా.. లక్షా 54వేల మంది చనిపోయారు. ఢిల్లీ ఒక్కప్రాంతంలోనే 6లక్షల 34వేల కేసులు, 10వేల మరణాలు నమోదయ్యాయని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

లాక్ డౌన్‌లో ఉన్న నిబంధనలు, సోషల్ డిస్టెన్సింగ్స్ వంటి నియమాలు.. హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగేలా చేశాయి. రాబోయే నెలల్లో ఇది 70శాతం వరకూ వెళ్లే అవకాశాలు ఉన్నాయని.. వ్యాక్సినేషన్ తో మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 7వేల కేసులు నమోదైన నవంబర్ నుంచి 200కేసులు మాత్రమే నమోదవుతున్న రోజులకు వచ్చాయని.. కొవిడ్-19పాజిటివ్ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని అంటున్నారు.