Covid-19: దేశంలో అతి తక్కువగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఎండెమిక్‌ దశకు వచ్చిన కొవిడ్?

దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న 164 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 98.80 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,345గా ఉందని వివరించింది. మొత్తం కేసుల్లో ఇది 0.01 శాతం అని తెలిపింది. మొన్న యాక్టివ్ కేసుల సంఖ్య 4,434గా ఉంది.

Covid-19: దేశంలో అతి తక్కువగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఎండెమిక్‌ దశకు వచ్చిన కొవిడ్?

Corona cases

Covid-19: దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న 164 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 98.80 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,345గా ఉందని వివరించింది. మొత్తం కేసుల్లో ఇది 0.01 శాతం అని తెలిపింది. మొన్న యాక్టివ్ కేసుల సంఖ్య 4,434గా ఉంది.

నిన్న కేవలం ఒక్క యాక్టివ్ కేసు మాత్రమే పెరిగింది. దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 90.76 కోట్లుగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 1,63,671 పరీక్షలు చేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 219.94 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వేసినట్లు చెప్పింది. నిన్న 42,506 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది.

దేశంలో కొన్ని వారాలుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కరోనా వైరస్‌ ఇప్పటికే ఎండెమిక్‌ (మహమ్మారి స్థాయి నుంచి స్థానికంగా వ్యాప్తి చెందే) దశకు చేరుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ప్రజలు కొన్ని నెలలుగా కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. అయినా కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్ వ్యాప్తి ఎండెమిక్‌ దశకు వచ్చినట్లేనని నిపుణులు అంటున్నారు.

iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!