Indian Cough Syrup: ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం

‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ఆ సంస్థను హరియాణా ప్రభుత్వం  ఆదేశించింది. పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’కు చెందిన దగ్గు సిరప్‌లే కారణమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది.

Indian Cough Syrup: ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం

Indian Cough Syrup

Indian Cough Syrup: ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ దగ్గు సిరప్‌ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని ఆ సంస్థను హరియాణా ప్రభుత్వం  ఆదేశించింది. పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’కు చెందిన దగ్గు సిరప్‌లే కారణమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది.

హరియాణాలోని సోనీపత్ లో ఈ ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ ప్లాంట్ ఉంటుంది. ఆ సంస్థ తమ ప్లాంట్ లో 12 నిబంధనలను ఉల్లంఘించిందని గుర్తించడంతో ప్రభుత్వం ఇప్పటికే షో కాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’కు చెందిన మూడు ఔషధాల శాంపిళ్లను కోల్ కతాలోని కేంద్ర ఔషధ ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. వాటి రిపోర్టులు ఇంకా రాలేదని అన్నారు.

ఆ రిపోర్టులు వచ్చాకే తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోనీపత్ లోని ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ ప్లాంట్ లో కేంద్ర, రాష్ట్ర అధికారులు సోదాలు జరిపి 12 ఉల్లంఘనలను గుర్తించినట్లు చెప్పారు. దీంతో అందులో ఉత్పత్తులను నిలిపివేయాలని ఆదేశించినట్లు వివరించారు. కాగా, దగ్గు సిరప్ లకు సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో ‘మైడెన్ ఫార్మాస్యూటికల్స్’ హామీ ఇవ్వడంలో విఫలమైందని డబ్ల్యూహెచ్‌వో కూడా ఇటీవల తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..