మోడర్నా వ్యాక్సిన్ సంవత్సర కాలం ఇమ్యూనిటీ

మోడర్నా వ్యాక్సిన్ సంవత్సర కాలం ఇమ్యూనిటీ

moderna-covid-19-vaccine

Moderna Vaccine: మోడర్నా వ్యాక్సిన్ సంవత్సరం పాటు ఇమ్యూనిటీ ఇస్తుందని నిపుణులు అంటున్నారు బయోటెక్ కంపెనీ. మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకోవడానికి వ్యాక్సిన్ తీసుకుంటే సంవత్సర కాలం పాటు ఇమ్యూనిటీ వస్తుందని చెప్తుంది. అంతేకాకుండా ఈ డ్రగ్ మేకర్ (ఎమ్ఆర్ఎన్ఏ) అనే కొత్త టెక్నాలజీపై కాన్ఫిడెంట్ క్రియేట్ చేస్తున్నారు.

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్ కు ఈ వ్యాక్సిన్ కరెక్ట్ గా సరిపోతుందని.. చెప్తున్నారు. ఈ మేరకు 2021మొత్తానికి 600మిలియన్ నుంచి 1బిలియన్ డోసులు సప్లై చేసేందుకు ప్రభుత్వాల నుంచి అగ్రిమెంట్ తీసుకుంది. ఇదే సమయంలో మోడర్నా నుంచి 200మిలియన్ డోసులు.. కొనుగోలు చేసింది యూఎస్.

ఇందులో జపాన్, కెనడా, ఇజ్రాబెల్ కూడా ఉండగా.. యూకే, యూరోపియన్ దేశాలు ఈ వారమే వ్యాక్సిన్ కు అప్రూవల్ ఇచ్చాయి.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. వైరస్ ను అరికట్టేందుకు సరిపడ వ్యాక్సిన్ డోసులను తయారుచేస్తామని చెప్పారు. పాపులేషన్ లో ఇమ్యూనిటీ పెంచాలని కాదు.. కరోనా వైరస్ పై మా పోరాటం. 2021లోనే అరికడతాం అని సైంటిస్టు అంటున్నారు.