Bharat Jodo Yatra: జమ్మూకశ్మీర్ చేరుకున్న భారత్ జోడో యాత్ర.. ఎక్కడ, ఎప్పుడు ముగియనుందంటే?

కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు ఉందని చెప్పారు. తన పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు.

Bharat Jodo Yatra: జమ్మూకశ్మీర్ చేరుకున్న భారత్ జోడో యాత్ర.. ఎక్కడ, ఎప్పుడు ముగియనుందంటే?

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్ చేరుకుంది. గత రాత్రి జమ్మూకశ్మీర్ చేరుకున్న నేపథ్యంలో రాహుల్ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన ఇంటికి చేరుకున్నట్లు ఉందని చెప్పారు. తన పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయని తెలిపారు.

దేశం గురించి, ప్రతి రాష్ట్రం గురించి, తన గురించి తాను ఎంతో నేర్చుకుంటున్నాని, అర్థం చేసుకుంటున్నానని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర కథువా ప్రాంతంలో కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ లో జరుగుతున్న పాదయాత్రలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, మెహమూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీనగర్ లో ఈ యాత్ర ఈ నెల 30న ముగియనుంది. రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర తుది దశకు చేరుకోవడంతో తదుపరి చేయాల్సిన కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది.

లోక్ సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వరకు భారత్ జోడో యాత్ర వంటి ర్యాలీని నిర్వహిస్తారని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ నేత విభాకర్ శాస్త్రి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రాహుల్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. రాహుల్ పాదయాత్రను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు.

Rishi Sunak Apologises: కారులో సీటు బెల్టు విషయంలో వివాదం.. క్షమాపణలు చెప్పిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్