మార్చి నుంచి 50ఏళ్లు పైబడ్డ వారికి కరోనా వ్యాక్సిన్

మార్చి నుంచి 50ఏళ్లు పైబడ్డ వారికి కరోనా వ్యాక్సిన్

Vaccination over 50 years people: మార్చి నుంచి 50ఏళ్లు అంతకంటే పైబడ్డ వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర హోం మంత్రి డా.హర్ష్ వర్ధన్ సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 8గంటల వరకూ హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు దేశవ్యాప్తంగా 83లక్షల మందికి పంపిణీ చేశారు. మొత్తం లక్షా 73వేల 729 సెషన్లు ఏర్పాటు చేసి 82లక్షల 85వేల 295మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.

హెల్త్ కేర్ వర్కర్లకు తొలి డోస్ కింద 59లక్షల 88వేల 113, రెండో డోస్ కింద 24వేల 561మందికి.. ఇవ్వగా ఫ్రంట్ లైన్ వర్కర్లు తొలి డోసులో 22లక్షల 72వేల 621మందికి ఇచ్చారు. ఈ రెండో డోస్ ఫిబ్రవరి 13నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే 50ఏళ్లు పైబడ్డ వారికి మార్చి నుంచి వ్యాక్సినేషన్ చేస్తాం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష్ వర్ధన్ అన్నారు.

మొత్తం ఫ్రంట్ లైన్ వర్కర్లలో 80 నుంచి 85శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగింది. రాబోయే నెలల్లో కనీసం 18-20వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్, క్లినికల్, అడ్వాన్స్‌డ్ స్టేజెస్ లలో రానున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ సోషల్ డిస్టెన్స్, మాస్క్ వాడకం మరిచిపోవద్దని అధికారులు చెబుతున్నారు.

ఇండియా మొత్తంలో కొవిడ్-19 యాక్టివ్ కేసులు లక్షా 39వేలు ఉండగా.. 33రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 24గంటల్లో 5వేల కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఇండియాలో ఉన్న కేసుల్లో 77శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర కలిపి మొత్తం యాక్టివ్ కేసుల్లో 74.72శాతం ఉన్నాయి.

ఫిబ్రవరి రెండో వారంలో అస్సాం, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖాండ్, మణిపూర్, నాగాలాండ్, లక్ష్యద్వీప్, మేఘాలయ, సిక్కిం, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లడఖ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.