Viral Video: మహిళా సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్‌మెంట్ మహిళలు జుట్టుపట్టుకుని కొట్టుకున్న వైనం 

నోయిడాలోని హైడి పార్క్ సొసైటీ సెక్టార్ 78లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రెసిడెంట్ బాడీ ఎన్నికల్లో సెక్యూరిటీ సిబ్బంది ఓ వర్గానికి అనుకూలంగా పనిచేస్తోందని మరో వర్గం వారు ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందిని కొందరు మహిళలు కొట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అంతా కలిసి తిరగబడ్డారు. అక్కడ అంతా ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో తమకు గాయాలయ్యాయని ఇద్దరు మహిళలు చెప్పారు.

Viral Video: మహిళా సెక్యూరిటీ సిబ్బంది, అపార్ట్‌మెంట్ మహిళలు జుట్టుపట్టుకుని కొట్టుకున్న వైనం 

Viral Video: నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద రెసిడెంట్ బాడీ ఎన్నికల్లో గొడవ చెలరేగి మహిళలు జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. కొందరు పురుషులు రాడ్లను తీసుకుని కొట్టుకోవాలని దూసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైడి పార్క్ సొసైటీ సెక్టార్ 78లో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

రెసిడెంట్ బాడీ ఎన్నికల్లో సెక్యూరిటీ సిబ్బంది ఓ వర్గానికి అనుకూలంగా పనిచేస్తోందని మరో వర్గం వారు ఆరోపిస్తూ వారిపై దాడికి దిగారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందిని కొందరు మహిళలు కొట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అంతా కలిసి తిరగబడ్డారు. అక్కడ అంతా ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది చేసిన దాడిలో తమకు గాయాలయ్యాయని ఇద్దరు మహిళలు చెప్పారు.

సెక్యూరిటీ సిబ్బంది దూసుకువచ్చి కర్రలతో కొట్టారని తెలిపారు. తాము సమావేశంలో పాల్గొనడానికి రాగానే లైట్లు ఆపేసి, సమావేశం జరగకుండా అడ్డుకోవడానికి సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారని చెప్పారు. హైడి పార్క్ సొసైటీ సెక్టార్ 78లో గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి ఆ ఘర్షణను ఆపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..