కోహ్లీనే మా కెప్టెన్.. మసాలా కోసం మాట్లాడొద్దు: రహానె

కోహ్లీనే మా కెప్టెన్.. మసాలా కోసం మాట్లాడొద్దు: రహానె

Ajinkya Rahane: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించి సాహో.. కెప్టెన్ అనే రేంజ్ లో తిరిగొచ్చాడు అజింకా రహానె. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను పరాజయంతో ముగించాడు. 227పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంపై కోహ్లీపైన విమర్శలు వస్తుండగా.. రహానెను కెప్టెన్ చేస్తే బెటర్ అంటూ సూచనలు వినిపిస్తున్నాయి.

ఇంగ్లాండ్‌తో సెకండ్ టెస్టుకు రహానెను కెప్టెన్ చేస్తారా అనే దానిపై అతనే స్పందించాడు. ‘మేం స్వదేశంలో రెండేళ్ల తర్వాత ఆడుతున్నాం. చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడాం. అది చూస్తే మీకే తెలుస్తుంది. ఇదంతా టీం కృషి. వ్యక్తిగత ప్రదర్శనపై ఫోకస్ పెట్టం. జట్టు కోసం ఏం చేయగలనో అదే చేస్తాం. కొన్ని మ్యాచ్ లు మినహాయిస్తే.. మేం ఏంటనేది మీకే తెలుస్తుంది. బయట ఏం జరుగుతుందనేది పట్టించుకోను అని వైస్ కెప్టెన్.. రహానె చెప్తున్నాడు.

కష్టమైన ప్రశ్నలు వచ్చినప్పుడు వెనుకడుగు వేసే రహానె కాదు. పూర్తిగా డిఫరెంట్ గా రెస్పాండ్ అయ్యాడు. కెప్టెన్సీ నుంచి మారినందుకా మీ బాడీ లాంగ్వేజ్ లో మార్పు కనిపిస్తుంది.

‘ఎనర్జీ లెవల్స్ ను బట్టి కొన్ని క్షణాలు అలా అనిపించొచ్చు. కానీ, అది కెప్టెన్సీలో మార్పు వల్ల కాదు. ముందుగా చెప్పినట్లే విరాట్ మా కెప్టెన్.. ఇకపై కూడా అతనే కెప్టెన్. మీరు మసాలా యాడ్ చేయాలనుకుని ప్రయత్నిస్తే.. దురదృష్టవశాత్తు మీకు దొరకకపోవచ్చు. కొన్నిసార్లు ఎనర్జీ లెవల్స్ మారుతున్నప్పుడు బాడీ లెవల్స్ లో మార్పులు కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి మ్యాచ్ మొదటి రెండు రోజులు. దాంతో పాటు ఇంకా చాలా కారణాలుంటాయని రహానె చెప్తున్నాడు.